Tollywood Anchors: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన యాంకర్స్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్లుగా ఎంతోమంది ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అంటే అందరికీ వెంటనే సుమ శ్రీముఖి అనసూయ రష్మీ వంటి వారి పేర్లు గుర్తుకు వస్తాయి.

 Tollywood Anchors Background Sreemukhi Suma Rashmi Anasuya Pradeep-TeluguStop.com

అలాగే మేల్ యాంకర్లలో గుర్తుకొచ్చే పేరు ప్రదీప్ వీరంతా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో కార్యక్రమాలను చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా బుల్లితెరపై యాంకర్లుగా అందరికీ పరిచయమైనటువంటి వీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాల గురించి చాలామందికి తెలియదు.మరి ఈ యాంకర్ల గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

సుమ కనకాల:

కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తన తండ్రి వృత్తిరీత్యా సికింద్రాబాద్ లో స్థిరపడ్డారు అందుకే తెలుగు చాలా బాగా నేర్చుకొని అనంతరం ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి సుమ (Suma) మొదట్లో టీవీ సీరియల్స్ లో నటించారు ఇలా సీరియల్స్ ద్వారా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో యాంకర్ గా మారిపోయారు యాంకర్ గా మాత్రం సుమ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

శ్రీముఖి:

బుల్లితెర రాములమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శ్రీముఖి (Sreemukhi) తెలుగు అమ్మాయే.ఈమె స్వస్థలం నిజామాబాద్ ఈమె తండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేశారు.ఈమె తల్లి బ్యూటీషియన్ గా పనిచేస్తున్నారు ఇలా ఉన్నత కుటుంబంలో జన్మించినటువంటి శ్రీముఖి కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించారు.అయితే వెండి తెరపై సక్సెస్ కాకపోవడంతో బుల్లితెర యాంకర్ గా స్థిరపడి మంచి సక్సెస్ అందుకున్నారు.

రష్మి గౌతమ్:

రష్మీ(Rashmi) టాలీవుడ్ యాంకర్లలో ఈమె కూడా స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందారు.ఈమె తల్లిదండ్రులు తెలుపు వారు కాకపోయినా ఈమె విశాఖపట్నంలో పెరగడంతో తనకు తెలుగు బాగా వచ్చు.ఇక ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి.ఇలా రష్మి కూడా కెరియర్ మొదట్లో వెండి తెరపై హీరోయిన్గా పరిచయమైనప్పటికీ ఈమెకు వెండితెర అచ్చి రాకపోవడంతో బుల్లితెరకు పరిచయమయ్యారు.

జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

అనసూయ:

అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ పుట్టింది విశాఖపట్నంలో అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే.బీటెక్ పూర్తి చేసినటువంటి అనసూయ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేశారు అనంతరం సాక్షి టీవీలో కూడా న్యూస్ రీడర్గా పనిచేస్తారు.ఇలా కొనసాగుతున్నటువంటి ఈమె యాంకర్ గా మా మహాలక్ష్మి అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ప్రదీప్:

ప్రదీప్ మాచిరాజు ఇండస్ట్రీలో మేల్ యాంకర్లలో ఒకరిగా ఈయన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ప్రదీప్( Pradeep ) పుట్టి పెరిగింది చదివింది మొత్తం హైదరాబాద్ లోనే.ఇక ఈయన కూడా యాంకర్ గా గడసరి అత్త సొగసరి కోడలు అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయనకి కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

ఇలా యాంకర్ గా బుల్లితెరపై కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై కూడా హీరోగా సందడి చేస్తున్నారు ఇదివరకు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా ప్రదీప్ 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన ఈయన ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు పలు సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారని తెలుస్తుంది.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=1381035596174213
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube