నెయిల్ ఆర్ట్ ఎక్కువ రోజులు ఉండాలా? అయితే ఇలా చేయండి!

ఇటీవ‌ల కాలంలో నెయిల్ ఆర్ట్స్ బాగా పాపుల‌ర్ అయ్యాయి.మ‌హిళ‌లు నెయిల్ ఆర్ట్స్ ను అమితంగా ఇష్ట ప‌డుతున్నారు.

 Tips For Long Lasting Nail Art! Long Lasting Nail Art, Nail Art, Latest News, Na-TeluguStop.com

సినీ సెలబ్రెటీలే కాకుండా సామాన్యులు సైతం పండగలకు, శుభకార్యాల‌కు మ‌రియు ప్రత్యేక సందర్భాలప్పుడు నెయిల్ ఆర్ట్ వేయించుకుంటున్నారు.అయితే ఎంతో ఖ‌ర్చు చేసి ఇష్టంగా వేయించుకునే నెయిల్ ఆర్ట్ రెండు, మూడు రోజుల‌కే పోతే.

అబ్బ‌బ్బా అప్పుడు వ‌చ్చే బాధ, చిరాకు అంతా ఇంతా కాదు.కానీ, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్‌ను పాటిస్తే.

నెయిల్ ఆర్ట్‌ను ఎక్కువ రోజుల పాటు నిలుపుకోవ‌చ్చు.మ‌రి ఎందుకు లేటు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

నెయిల్ ఆర్ట్ కొద్ది రోజుల పాటు ఉండాలీ అంటే.నెయిల్స్ పై పేరుకుని ఉండే దుమ్మూ ధూళి మ‌రియు పాత నెయిల్ పాలిష్ పూర్తిగా తొలిగించాలి.అనంత‌రం నెయిల్ ఆర్ట్ వేయించుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది.

అలాగే నెయిల్ ఆర్ట్ ఎక్కువ రోజుల పాటు నిల‌ప‌డంలో యాపిల్ సైడ‌ర్‌ వెనిగర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అవును, ఆర్ట్ వేయించుకునే ముందు నెయిల్స్‌కు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ అప్లై చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

లెమ‌న్ జ్యూస్‌తోనూ నెయిల్ ఆర్ట్‌ను ఎక్కువ రోజుల పాటు ఉంచుకోవ‌చ్చు.

ముందుగా ఒక బౌల్‌లో ఐదు స్పూన్ల లెమ‌న్ జ్యూస్ వేసి.అందులో ఒక‌టి లేదా రెండు నిమిషాల పాటు నాన బెట్టు కోవాలి.

అనంత‌రం పొడి క్లాత్‌తో శుభ్రం చేసుకుని.అప్పుడు నెయిల్ ఆర్ట్‌ను వేసుకోవాలి.

Telugu Applecider, Beautiful Nails, Latest, Long Nail Art, Nail Art, Nail Art Lo

నెయిల్ ఆర్ట్ వేసుకున్న త‌ర్వాత కాసేపు ఆర‌బెట్టుకోవాలి.అనంత‌రం ఐస్ వాట‌ర్‌లో కాసేపు ఉంచితే.గోర్ల‌కు నెయిల్ ఆర్ట్ బాగా అతుక్కుంటుంది.ఫ‌లితంగా ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.

ఇక నెయిల్ ఆర్ట్ వేసుకున్నాక ఎక్కువ రోజుల పాటు ఉండాలీ అంటే.ఇంటి పనులు చేసే సమయంలో చేతులకు రబ్బర్‌ గ్లౌజులు వేసుకోవాలి.

ఈ గ్లౌజులు చేతులపై నీళ్లు పడకుండా ఉంటాయి.దాంతో నెయిల్ ఆర్ట్ కొన్ని రోజుల పాటు నిలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube