ప్రతి సంవత్సరం వైశాఖ మాస శుక్ల పక్షంలో మూడవ రోజు అక్షయ తృతీయ వస్తుంది.ఈ అక్షయ తృతీయను హిందువులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు విష్ణుమూర్తి, లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అదేవిధంగా సంపదకు అధిపతి అయిన కుబేరుడిని కూడా అక్షయ తృతీయ రోజు పూజ చేస్తారు.
అక్షయ తృతీయ పసిడి రాశుల పర్వదినంగా కూడా పిలుస్తారు.ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు మహిళలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తారు.
ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ ఈ పేరు ఎలా వచ్చింది, అక్షయ తృతీయ రోజు ఏ వస్తువులు దానం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
మొట్టమొదటిసారిగా బంగారం భూలోకంలో గండకీ నది లోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు బయటపడింది.
అందుకే ఈ రోజు అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.అక్షయ తృతీయ అనగా తరిగిపోనిది అని అర్థం.అందుకే అక్షయ తృతీయను బంగారు పండుగ అని కూడా పిలుస్తారు.సాధారణంగా అన్ని లోహాలు మాదిరిగా బంగారం కూడా ఒక సాధారణమైన లోహం కాదు.
బంగారం దేవతా లోహం అందుకే బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.
![Telugu Akshya Tritiya, Basil, Importance, Silver Cup-Telugu Bhakthi Telugu Akshya Tritiya, Basil, Importance, Silver Cup-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/05/akshya-tritiya-importance-Silver-cup-Basil-leaves-gandaki-river.jpg)
అక్షయ తృతీయ అంటే ఎంతో అక్షయమైన అనగా శుభప్రదమైనది, తరిగిపోని అనే అర్థం కనుక ఇంతటి పవిత్రమైన రోజు మనం ఏ వస్తువులు కొనుగోలు చేసిన, గృహ నిర్మాణాలు చేపట్టిన, స్థలాలు కొనుగోలు చేసిన శుభప్రదమని భావిస్తారు.మిగతా రోజులలో ఏవైనా వస్తువులు కొనడానికి వారం, శుభ సమయం వంటివి చూస్తాము.కానీ అక్షయ తృతీయ రోజు ఎలాంటి సమయంలో కొన్న శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఎంతో పవిత్రమైన ఈ రోజున పెద్ద ఎత్తున శ్రీమహాలక్ష్మికి పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొందుతారు.అదేవిధంగా ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వారు దానధర్మాలను నిర్వహిస్తారు.నువ్వులు, మంచం, గంధం, మారేడు దళాలు, కొబ్బరికాయ వంటివి దానం చేయటం వల్ల కుటుంబ అభివృద్ధి జరుగుతుంది.అదే విధంగా వెండి లేదా రాగి చెంబులో నీటిని తులసీ దళాలను వేసి దానం చేయడం వల్ల వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది.
ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు చెప్పులు దానం చేయడం వల్ల స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
LATEST NEWS - TELUGU