తెలంగాణలో కేవలం ఒక్క మహిళలకే రక్షణ ఉందని వైఎస్ఆర్ టీపీ అధినేత్ర షర్మిల అన్నారు.రాష్ట్ర మహిలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ బిడ్డకు తప్ప వేరే ఏ మహిళకు రక్షణ లేదని ఆరోపించారు.కవిత మహిళై ఉండి బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాం చేశారని విమర్శించారు.
అటువంటి ఆమె మహిళల గౌరవం కోసం కొట్లాడుతుందంట అంటూ ఎద్దవా చేశారు.అసలు బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు రిజర్వేషన్ ఉందా అని ప్రశ్నించారు.
ఎంతమంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని నిలదీశారు.తెలంగాణ కేబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులున్నా వాళ్లు డమ్మీలనేనని కీలక వ్యాఖ్యలు చేశారు.