ఆ పార్టీ వల్లే కత్తి మహేష్ మృతి అంటున్న పూనమ్ కౌర్!

తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన నటుడు కత్తి మహేష్ మరణ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.కొన్ని రోజుల కిందట ఆయనకు రోడ్డు ప్రమాదం జరగగా ఇక ఆరోజు నుండి చెన్నైలో ఆయనకు వైద్యం జరుగుతుండగా శనివారం సాయంత్రం ప్రాణాలను వదిలారు.

 Actress Poonam Kaur Shocking Comments On Kathi Mahesh Death, Poonam Kaur, Kathi-TeluguStop.com

సినీ రంగానికి చెందిన వాళ్లు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఆయన మరణానికి కారణం ఆ పార్టీ అంటూ పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

తెలుగు సినీ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఈమె నటిగా కంటే సోషల్ మీడియాలో చేసే పోస్టులతో బాగా పరిచయం పెంచుకుంది.తను చేసే ట్వీట్ లు తరచు వివాదానికి కూడా దారి తీస్తుంటాయి.ఇక గతంలో తనపై కత్తి మహేష్ కూడా విమర్శలు చేయగా వీరిద్దరి మధ్య వివాదాలు కూడా ఎదురయ్యాయి.ఇక అలా ఆయనకు ప్రమాదం జరిగినా కూడా ప్రాణాలతో బయట పడాలి అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది.

Telugu Car, Kathi Mahesh, Poonam Kaur, Poonamkathi, Tollywood-Movie

కత్తి మహేష్ మరణించిన వార్త విన్నాక పూనమ్ కౌర్ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది.అప్పట్లో తన తప్పు ఏమాత్రం లేకుండానే తను ప్రతి రోజు కొంచెం కొంచెం చచ్చిపోయేదట.అప్పుడు తనకు ఎందుకిలా జరిగిందో తన మనసుకి అస్సలు అర్ధమయ్యేది కాదని తెలిపింది.దాంతో తనకు చాలా బాధ అనిపించింది అంటూ తెలిపింది.ఇక తన పరువుకు భంగం కలిగించమని కత్తి మహేష్ ను ఓ రాజకీయ పార్టీ ప్రేరేపించిందని తెలిపింది.

Telugu Car, Kathi Mahesh, Poonam Kaur, Poonamkathi, Tollywood-Movie

అది దళితులను దుర్వినియోగం చేయడమే అంటూ కత్తి మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపింది.ఇకపై ఎప్పుడు అతని పేరు ప్రస్తావించకూడదని నిర్ణయించుకుందట.ఇక ఆయన ఆత్మ శాంతికి ఓం శాంతి అని తెలుపుతూ పోస్ట్ చేసింది.

నిజానికి పూనమ్ కౌర్ రాజకీయ విషయాలలో కూడా తల దూర్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube