ఇటీవల బిఆర్‌ఎస్ మరియు బీజేపీ ( BRS, BJP )నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు బాగానే జరిగాయి.ఎన్నికల ముందు ఆ రెండు పార్టీలలోని కీలక నేతలంతా కూడా ఆ కాంగ్రెస్ బాటా పట్టడంతో హస్తం పార్టీ బలం రోజు రోజుకు పెరుగుతోంది.
ఆ మద్య బిఆర్‌ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణరావు.వంటివారు కాంగ్రెస్ గూటికి చేరితే.
ఇటు బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ), విజయశాంతి, వివేక్.వంటి కూడా అదే దారిలో నడిచారు.
అయితే ఎన్నికల ముందు పార్టీలు మారడం షరా మామూలే అయినప్పటికి బయటకు వచ్చినవారు బిఆర్‌ఎస్ మరియు బీజేపీకి మద్య దోస్తీ అంటగడుతుండడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

బిఆర్‌ఎస్ మరియు బీజేపీ రహస్య ఒప్పందం కుదిరందని అందుకే ఆ విధానం నచ్చకే పార్టీని విడామంటూ ఆ మద్య ఇటీవల విజయశాంతి, ఆ మద్య రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటివారు బలంగా చెబుతున్నారు.అంతే కాకుండా ప్రస్తుతం బిఆర్‌ఎస్ విజయం కోసమే బీజేపీ కాస్త ప్రచారంలో వెనకడుగు వేస్తోందని విమర్శలు కూడా వ్యక్తమౌతున్నాయి.దీంతో నిజంగానే బిఆర్‌ఎస్ మరియు బీజేపీ మద్య దోస్తీ కుదిరిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
ఈ విమర్శలలో నిజనిజాలను పక్కన పెడితే.ఈ విమర్శ బిఆర్‌ఎస్ కే నష్టం కలిగిస్తుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఎందుకంటే బిఆర్‌ఎస్ పై( BRS ) మతతత్వ పార్టీ అనే ముద్ర బలంగా ఉంది.ఎస్సీ, ఎస్టీ లలో బీజేపీకి ఓటు శాతం తక్కువ.ఇక మైనారిటీలలో అసలు బీజేపీకి ఓటు శాతమే లేదు.కానీ బిఆర్‌ఎస్ కు మాత్రం అన్నీ వర్గాల్లోనూ ఓటు శాతం ఉంది.ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ మరియు బీజేపీ మద్య పొత్తు ఉందనే విమర్శ బలపడితే బీజేపీ పై విముఖత చూపే కొన్ని వర్గాల ప్రజలు బిఆర్‌ఎస్ కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.అందుకే బీజేపీ మరియు బిఆర్‌ఎస్ మద్య దోస్తీ అనే విమర్శను కాంగ్రెస్ పదే పదే నొక్కి చెబుతోంది.
మరి ఈ విమర్శలు బిఆర్‌ఎస్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.