భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ గెలవాలని భారత జట్టుతో పాటు భారత్ లో ఉండే ప్రతి ఒక్కరూ కోరుకున్న విషయం అందరికీ తెలిసిందే.భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) కూడా కచ్చితంగా టైటిల్ భారత్ కే స్వంతం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం కూడా తెలిసింది.2011లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచ కప్( ODI World Cup ) లో భారత్ విజేతగా నిలిచింది.అప్పటినుంచి సొంత గడ్డపై మరో ప్రపంచకప్ గెలవలేకపోయింది.2015, 2019 ప్రపంచ కప్ లో జరిగే మ్యాచ్లలో అద్భుత ఆటనే కనబరిచిన కూడా కీలక మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది.12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో విజేతగా నిలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

భారత్ గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్న మాత్రాన అది సాధ్యం కాదని, జట్టులో ఉండే లోపాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని భారత జట్టు మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ తెలిపాడు.సీనియర్ ఆటగాళ్ల గాయాల కారణంగా మిడిల్ లార్డర్ బలహీనంగా మారిందన్నాడు.

ప్రస్తుత భారత జట్టులో టాప్-5 ఆటగాళ్లలో ఒక్క లెప్టాండర్ కూడా లేడు.2011 వన్డే ప్రపంచ కప్, 2007 t20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్లను పరిశీలిస్తే టాప్ -5 బ్యాటర్లలో ఒక లెప్టాండర్ ఉన్నాడు.ఆ లెప్టాండర్ రెండు ఫైనల్ మ్యాచ్లలో ఆడాడు.అతను ఎవరో కాదు గౌతమ్ గంభీర్.వన్డే వరల్డ్ కప్ కు పర్ఫెక్ట్ భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్/ తిలక్ వర్మ( Yashasvi Jaiswal ), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్/ సంజూ శాంసన్, హార్థిక్ పాండ్యా రవీంద్ర జడేజా /అక్షర్ పటేల్, శార్థూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ/ మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్.