కరివేపాకు సాగులో మంచి దిగుబడి కోసం మెళుకువలు..!

కరివేపాకు సాగు( Curry leaves ) అంటే కొంతమంది రైతులు పెద్దగా ఆదాయం ఉండదని ఆసక్తి చూపించడం లేదు.కానీ మరి కొంతమంది రైతులు కరివేపాకు సాగు చేసి అధిక దిగుబడి సాధించడంతోపాటు అధిక లాభాలను అర్ధిస్తున్నారు.

 Techniques For Good Yield In Curry Leaves Cultivation..! , Curry Leaves , Ch-TeluguStop.com

కరివేపాకులో పోషకాలు అధికంగా ఉండడం వల్ల ప్రతి ఆహార పదార్థంలో ఈ కరివేపాకును కచ్చితంగా ఉపయోగిస్తున్నారు.తెలుగు రాష్ట్రాలలో ఉండే రైతులు కరివేపాకు సాగు పై అవగాహన ఉండడంతో ఆసక్తి చూపిస్తున్నారు.

Telugu Agriculture, Curry, Farmers, Yield-Latest News - Telugu

కరివేపాకు సాగు లో ముఖ్యంగా పాటించాల్సిన మెళుకువలు ఏమిటో తెలుసుకుందాం.కరివేపాకు సాగుకు డీడబ్ల్యుడీ -1, 2 రకాలతో మంచి దిగుబడి పొందవచ్చు.మొక్కల మధ్య కనీసం 50 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ఈ పంట సాగుకు రసాయన ఎరువులు( Chemical fertilizers ), పురుగు మందుల అవసరం ఉండదు.

కాకపోతే ప్రతి మూడు రోజులకు ఒకసారి కచ్చితంగా కరివేపాకు పంటకు నీటి తడులు అందించాలి.నీటిని సమృద్ధిగా అందిస్తే ఆకులు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతాయి.

Telugu Agriculture, Curry, Farmers, Yield-Latest News - Telugu

ఒక ఎకరం పొలంలో దాదాపుగా 30 టన్నుల దిగుబడి పొందవచ్చు.కరివేపాకు మొక్కలు నాలుగు అడుగుల పొడవు పెరిగిన తర్వాత కోతలు చేపట్టాలి. రైతులకు( Farmers ) ఈ పంట సాగులో శ్రమతో పాటు పెట్టుబడి కూడా చాలా తక్కువ.కరివేపాకులో అంతర పంటగా పప్పు ధాన్యాలు, ఆకుకూరల్ని కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.

కరివేపాకు కు నీటిపారుదల సౌకర్యం లేని నప్పుడు మెట్ట ప్రాంతాలలో వర్షాధారంగా కూడా సాగు చేయవచ్చు.ఈ పంట విత్తిన తొమ్మిది నెలల తర్వాత పంట కూతకు వస్తుంది.

మొదటి కోతలో దిగుబడి, ఆదాయం కాస్త తక్కువగానే ఉంటుంది.రెండో సంవత్సరం నుండి పంట దిగుబడి బాగా పెరుగుతుంది.

ఇక ప్రతి కోతకు దిగుబడి పెరుగుతూనే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube