విజయవాడలోని కృష్ణలంక రాణిగారితోటలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వైసీపీకి ఇదే చివరి సంవత్సరం అని చంద్రబాబు జోస్యం చెప్పారు.క్యాన్సర్ మాదిరిగా సమాజాన్ని జగన్ పట్టి పీడిస్తున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో సమాజాన్ని నాశనం చేసే వైసీపీ జెండాను ఎవరూ మోయొద్దని చెప్పారు.ప్రతి ఒక్కరూ టీడీపీ జెండాను పట్టుకోవాలన్నారు.
టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఏ రౌడీని వదిలిపెట్టేది లేదని వెల్లడించారు.