సైన్స్… నేడు ప్రపంచం ప్రగతిపథంలో దూసుకుపోతోంది అంటే దానికి కారణం సైన్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చిన్న పిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ విషయం తెలుసు.
ఈ క్రమంలో సైన్స్ ఎన్నో ఘనతలను సాధించింది, ఛేదించింది.అయితే ఈ ప్రపంచంలో ఇప్పటివరకు సైన్స్ ఛేదించలేని ప్రశ్నలు కూడా కొన్ని వున్నాయి.వాటిలో మొదటిది “ఏలియన్స్.” భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాల మీద కూడా వేరే ప్రాణులు ఉన్నాయని, వాటిని ఏలియన్స్ అంటారని కొంతమంది నమ్మకం.అయితే ఈ విషయాన్ని సైన్స్ ఇంతవరకు ఛేదించలేదు.
ఈ లిస్టులో రెండవది “దెయ్యాలు మరియు పునర్జన్మ.” వీటిగురించి చిన్నప్పటినుండి కధలుకధలుగా ఉంటాము.కానీ దీంట్లో ఏది వాస్తవం అనేది సైన్సు ఇంకా తేల్చి చెప్పలేదు.
దెయ్యాలు, పునర్జన్మపై భిన్న వాదనలు జరుగుతూనే ఉన్నాయి.ఇక మూడవది “మరణం.” పుట్టిన ప్రతి ప్రాణి చనిపోవాల్సిందే అని అందరికీ తెలిసినదే.అయితే మనిషిని మరణం నుంచి కాపాడడానికి కొన్ని శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
కానీ మానవుడు చావుని జయించలేకపోతున్నాడు.
ఇందులో నాల్గవది “విశ్వం.” మనిషి పుట్టుకకు ముందు విశ్వంలో ఓ విస్పోటనం జరిగిన కారణంగా భూమి ఏర్పడింది.ఆ తర్వాత మానవాళి పుట్టింది అని చెబుతూ వుంటారు.
అయితే దీనిపైన సరియైన ఆధారాలు లేవు.ఈ లిస్టులో చివరిది “కలలు.” నిద్రలో సుమారుగా అందరికీ కలలు వస్తాయి.మనకు ఉండే కోర్కెలే కలల రూపంలో వస్తాయని ‘ఫ్రాయిడ్’ అనే శాస్త్రవేత్త చెప్పాడు.
అయితే మనిషికి ఎక్కువసార్లు సంబంధం లేని కలలే వస్తూ ఉంటాయి.అలా ఎందుకు వస్తాయనేది సైన్స్ ఇంకా వివరించలేదు.
మనకు వచ్చిన కొన్ని కలలు ఎందుకు మర్చిపోతాం, కొన్ని ఎందుకు గుర్తు పెట్టుకుంటాం అనే విషయం కూడా చెప్పలేదు.ఇంకా ఇలాంటివి సైన్స్ ఛేదించలేనిని ఎన్నో వున్నాయి.
అందులో ఇవి ముఖ్యమైనవి.