ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతుల కుటుంబాలను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవీ బీఆర్ఎస్ పరోక్షంగా చేసిన హత్యలని ఆరోపించారు.
ఘటనకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే బాధ్యులన్న పొంగులేటి వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ నేతలు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియోతో పాటు గాయపడిన వారికి రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.