ఏ సినిమా చేయాలన్నా పెట్టుబడి కచ్చితంగా ఉండాలి.పెట్టుబడి పెట్టాలంటే నిర్మాతలు ఉండాలి.
ఇక ఏ సినిమాకు తగ్గట్టుగా అంత డబ్బు మాత్రమే ఖర్చు పెడతారు నిర్మాతలు.ఇక కొన్ని కొన్ని సార్లు హీరోలకు తగ్గట్టుగా ఖర్చు పెడుతూ ఉంటారు.
స్టార్ హీరో అయితే మాత్రం వారికి కచ్చితంగా పారితోషకం విషయంలో బాగా డిమాండ్ ఉంటుంది.
ఇక స్టార్ హీరోల సినిమాలకు మాత్రం బాగా పెట్టుబడి పెడుతుంటారు నిర్మాతలు.
ఏమాత్రం తగ్గకుండా వెనుకాడకుండ నిర్మాతలు స్టార్ హీరోల సినిమాలకు బాగా ఖర్చులు పెడుతుంటారు.చిన్న హీరోల సినిమాలకు మాత్రం ఒక మితం పరంగా మాత్రమే ఖర్చు పెడతారు.
అయితే చిన్న హీరోల సినిమాలైనా కూడా తక్కువ పెట్టుబడి పెట్టిన కూడా నిర్మాతలకు బాగా కలిసి వచ్చిన రోజులు ఉన్నాయి.అయితే తక్కువ పెట్టుబడిలతో కొన్ని సినిమాలు చేయగా ఆ సినిమాలతో నిర్మాతలు కోటీశ్వరులు అయ్యారు.ఇంతకు ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
రన్ రాజా రన్:
డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది.ఇక ఈ సినిమాని యూ వి క్రియేషన్స్ బ్యానర్ పై ఉప్పలపాటి ప్రమోద్, వి.వంశీకృష్ణారెడ్డి ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమాల్లో శర్వానంద్ హీరోగా నటించాడు.అయితే ఈ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ తో పెట్టుబడి పెట్టే సినిమాను నిర్మించగా ఈ సినిమా రూ.20 కోట్లను వసూలు చేసుకుంది.
ఖైదీ:
లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విడుదలైన సినిమా ఖైదీ.యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.ఇందులో కార్తీ హీరోగా నటించాడు.
ఇక ఈ సినిమా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు, తిరుప్పూర్ వివేక్ ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమాకు రూ.25 కోట్లు ఖర్చు పెట్టగా ఈ సినిమా మొత్తం రూ.107 కోట్ల బడ్జెట్ ను వసూలు సొంతం చేసుకుంది.
స్వామి రారా:
సుధీర్ వర్మ దర్శకత్వంలో విడుదలైన సినిమా స్వామి రారా. ఒక చిన్ని విగ్రహం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.ఇక ఇందులో నిఖిల్ హిరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమాను లక్ష్మీనరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి ఈ సినిమాను నిర్మించాడు.
ఇక ఈ సినిమాకు మొత్తం నాలుగు కోట్లు ఖర్చు పెట్టగా.మొత్తం 22 కోట్లను వసూలు సొంతం చేసుకుంది.
రఘువరన్ బీటెక్:
2017 విడుదలైన సినిమా రఘువరన్ బీటెక్.ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించాడు.ఇక శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను నిర్మించాడు.ఈ సినిమా ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టగా రూ.53 కోట్లు వసూలు సొంతం చేసుకుంది.