నేషనల్ క్రికెట్ అకాడమీకి సెలెక్ట్ అయ్యే సులభమైన మార్గాలు ఇవే..!

భారతదేశంలో( India ) అత్యంత ఆదరణ పొందిన క్రీడలలో క్రికెట్ అగ్రస్థానంలో ఉందని అందరికీ తెలిసిందే.భారతదేశంలో క్రికెట్ అభిమానులు మతం కంటే ఎక్కువగా క్రికెట్ నే ఆరాధిస్తారు.

 These Are The Easy Ways To Get Selected For National Cricket Academy , National-TeluguStop.com

భారత జట్టు క్రికెటర్లు అద్భుత ఆట ప్రదర్శన చేస్తే అభిమానుల సంతోషానికి అవధులే ఉండవు.కాబట్టి చాలామంది చిన్ననాటి నుండే క్రికెట్ ను కెరిర్ గా మార్చుకోవాలని నిర్ణయించుకుంటారు.

క్రికెట్ ను కెరీర్ గా మార్చేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీకి సెలెక్ట్ అవడం ప్రధాన టార్గెట్ గా పెట్టుకుని, అందుకోసం శ్రమించాలి.

Telugu Latest Telugu, Nationalcricket, Camps, Waysnational-Sports News క్ర

బీసీసీఐ 2000 సంవత్సరంలో నేషనల్ క్రికెట్ అకాడమీ ( National Cricket Academy )(NCA) ను ఏర్పాటు చేసింది.NCA దేశంలోని క్రికెట్ ట్రైనింగ్ సెంటర్లలో అత్యంత ప్రధానమైనది.కాబట్టి క్రికెట్ ఆటగాడిగా రాణించాలంటే ముందుగా NCA కు ఎంపిక కావాల్సి ఉంటుంది.

మరీ NCA కు సెలెక్ట్ అవ్వాలంటే ఎలాంటి అర్హతలు సాధించాలో తెలుసుకుందాం.NCA కు సెలెక్ట్ కావాలంటే ముందుగా క్రికెట్ లో వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉండాలి.

కచ్చితంగా తమ స్కూల్ క్రికెట్ టీం లో ఒక ప్లేయర్ అయి ఉండాలి.ఆ స్కూల్ క్రికెట్ టీం అకాడమీ లెవెల్ లో క్రికెట్ ఆడాలి.

స్కూల్ లెవెల్ తర్వాత అండర్-15, U-17, U-19, U-23 ఓపెన్ డివిజన్ వంటి వివిధ ఏజ్ లెవెల్ కేటగిరీ కవర్ చేస్తూ జిల్లాస్థాయి పోటీలలో ఆడి రాణించాలి.ఈ దశలలో రాణించిన తర్వాత రాష్ట్రస్థాయిలో పోటీపడేందుకు ప్రత్యేక కోచింగ్ పొందాలి.

ఆ తరువాత జాతీయ క్రికెట్ అకాడమీలో చేరడానికి అవకాశం లభిస్తుంది.

Telugu Latest Telugu, Nationalcricket, Camps, Waysnational-Sports News క్ర

మొదటినుండి క్రికెట్లో మెరుగుగా రాణిస్తే రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ క్యాంప్స్( Sports camps ) కు సెలెక్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.అనంతరం NCA ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్ తో సంబంధిత ఏజ్ కేటగిరీలో జాతీయస్థాయిలో టాప్-5 లైనప్ కు సెలెక్ట్ అయ్యే అవకాశం వస్తుంది.ఇక ఈ సెలక్షన్ తర్వాత జోనల్ స్థాయిలో క్రికెట్ ఆడే అవకాశాలు వస్తాయి.

జోనల్ అకాడమీలో విభిన్న టోర్నమెంట్లలో పాల్గొనడానికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు.ఇక్కడ ఆటగాళ్ల సామర్ధ్యాల ఆధారంగా తర్వాతి సెలక్షన్ ఆధారపడి ఉంటుంది.

జోనల్ అకాడమీలో ఆటకు తగ్గట్లు మెరుగ్గా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది.ఆ విధంగానే ట్రైనింగ్ ఇస్తారు.

ఇక భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు పదిలం అవుతాయి.అయితే క్రికెటర్ గా కెరియర్ ప్రారంభించాలంటే.

సుదీర్ఘ ప్రయాణానికి కుటుంబ మద్దతుతో పాటు ఓపిక, ఆర్థిక బలం చాలా అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube