బడ్జెట్ ధరలో బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే... 35 కిలోమీటర్లు పైనే వస్తాయి!

కార్లు కొనాలని ఎవరికుండదు? నేటి దైనందిత జీవితంలో… ఈ ట్రాఫిక్ మహాయుగంలో ఓ కుటుంబంతో దూర ప్రయాణాలు వెళ్లాలంటే ఇపుడు కారు తప్పనిసరి అయిపోయింది.అయితే కారు కొనడం అనేది అందరికీ సాధ్య పడదు.

 These Are The Best Mileage Cars At A Budget Price More Than 35 Kms-TeluguStop.com

ఒకవేళ EMIలో కొన్నప్పటికీ దాని మైలేజ్ కారణంగా ఎక్కువమంది అలోచించి కారు కొనడానికి కాస్త వెనకడుగు వేస్తారు.ఎందుకంటే కార్లు మంచినీళ్లు తాగేటట్టు ఆయిల్ తాగుతాయ్.

దాంతో వాటిని మెంటైన్ చేయాలంటే నెలకు తక్కువలో తక్కువ 7 వేలరూపాయిల వరకూ కావాల్సి ఉంటుంది.

అయితే ఇలాంటి కార్లైనా 19, 20 కోలోమీటర్లకు మించి మైలేజ్ రవి.35 కోలోమీటర్లు వస్తే ఎంతో అదృష్టం అని ఫీల్ అవుతారు సదరు వాహనదారులు.అయితే ఆమాత్రం మైలేజ్ ఇచ్చే కార్లు కూడా మనకి మార్కెట్లో అందుబాటులో వున్నాయి.

ఇపుడు వాటిగురించి తెలుసుకుందాం.మారుతీ సుజుకీ కార్లు ఎక్కువగా మైలేజ్ ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ధర కూడా అందుబాటులో ఉండడంతో చాలామంది వాటిని సజెస్ట్ చేస్తున్నారు.

మారుతీ సుజుకీ అల్టో 800 కారు ఇపుడు తక్కువ ధరకే లభిస్తుంది.దీని ఎక్స్‌షోరూమ్ రేటు 3.39 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.0.8 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఇందులో కలదు.ఇంకా మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన సెలెరియో కారు కూడా అందుబాటు ధరలో అంటే రూ.5.25 లక్షలకే లభ్యం అవుతోంది.ఈ సీఎన్‌జీ మోడల్ 35 కిలోమీటర్లకు పైగా మైలేజ్ వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.అలాగే మారుతీ సుజుకీ ఎస్ ప్రెసో కారు రూ.4.25 లక్షలకే లభ్యమౌతుంది.ఇందులో 15 ఇంచుల అలాయ్ వీల్స్, 7 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, రియర్ డీఫాగర్ విత్ వైపర్స్, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube