సాధారణంగా ఒక నగరం బాగుందా లేదా అని చెప్పడానికి అక్కడి ప్రజా రవాణా వ్యవస్థని చూస్తేనే అర్ధం అయిపోతుంది.ఇక మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్న సో కాల్డ్ నగరాల పరిస్థితి ఎలా వుందో చెప్పాల్సిన పనే లేదు.
మనకి అదొక్కటే తక్కువ అవుతుంది.రోడ్లపై నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌తో మన దైనందిన జీవితాలు చాలా గందరగోళానికి గురవుతున్నాయి.
పర్యావరణానికి అయితే చాలా తీవ్రస్థాయిలో ముప్పు వాటిల్లుతోంది.ప్రస్తుతం మనదగ్గర నగర ప్రయాణం అంటేనే నరకంలా మారిన పరిస్థితి వుంది.
ఇలాంటి తరుణంలో గ్లోబల్ సిటీ గైడ్స్‌కు( Global City Guides ) చెందిన టైమ్ అవుట్( Time out ) అనే సంస్థ తాజాగా ప్రజా రవాణా అత్యుత్తమంగా ఉండే నగరాల జాబితాను విడుదల చేయడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ నగరాల్లో దాదాపు 20,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేను విడుదల చేయడం జరిగింది.ఈ విషయమై టైమ్స్ ఔట్ ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రజా రవాణా ద్వారా మీ నగరం చుట్టూ తేలికగా చుట్టేయొచ్చా? అని వారు ఆయా ప్రజలను సూటిగా అడిగారట.దానికి ఐదుగురు స్థానికుల్లో నలుగురు తమ నగరంలోని ప్రజా రవాణా నెట్‌వర్క్ గురించి మంచి విషయాలు చెప్పారట.
ఆ వివరాలు ఒక్కసారి ఇక్కడ చూద్దాము.అందులో మొదటగా బెర్లిన్( Berlin ) గురించి చుస్తే బెర్లిన్‌లో ప్రజా రవాణా బాగుందని 97 శాతం మంది బెర్లిన్ వాసులు చెప్పడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ఐరోపాలోని అత్యంత అందమైన నగరాల్లో ఒకటైన ప్రేగ్‌లో( Prague ) సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ఉందని ఈ సర్వేద్వారా తేలింది.అదేవిధంగా ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన టోక్యోలో( Tokyo ) ప్రజా రవాణా స్థానికులకు సంతృప్తి పరిచేదిగానే వుంది.దీనికి స్థానికులు 94 శాతం ఓట్లేశారు.అలాగే కోపెన్‌హాగన్‌లో రైళ్లు, బస్సులు, వాటర్‌బస్సుల వ్యవస్థ బాగుంటుందట.ఇక స్టాక్‌హోమ్‌లోని ప్రజా రవాణాలో ట్రామ్‌లు, బస్సులు, ఫెర్రీలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని తెలుస్తోంది.ఇక 92 శాతం మంది సింగపూర్ ప్రజలు తమ నగరంలో ప్రజా రవాణా బెస్ట్ అని చెప్పకనే చెప్పేశారు.
అలాగే సమర్థవంతమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన రవాణాకు హాంకాంగ్ పెట్టింది పేరు.అందుకే 92 శాతం మంది నగరవాసులు గుడ్ అని తేల్చేశారు.