తెలంగాణలో అధికార బిఆర్ఎస్ మరియు ప్రతిపక్ష బీజేపీ మద్య జరిగే రాజకీయ రగడ అందరికీ తెలిసిందే.ఈ రెండు పార్టీల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదం కొనసాగుతూ ఉంటుంది.
తెలంగాణను కేసిఆర్ ముంచేస్తున్నారని, కేసిఆర్ కుతుంబ పాలన వల్ల రాష్ట్రం నష్టపోతుందని ఒకవైపు బీజేపీ నేతలు చెబుతుంటే.మరోవైపు తెలంగాణకు నిధులు రాకుండా బీజేపీ అపుతోందని, తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు వహిస్తుందని బిఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తుంటారు.
దీంతో ఈ రెండు పార్టీల నేతలు చేసే విమర్శలు రాజకీయ వేడిని పుట్టిస్తుంటాయి.ఇక గత కొన్నాళ్లుగా బిఆర్‌ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేస్తుంటే.
రాష్ట్ర బీజేపీ నేతలను కేసిఆర్ సర్కార్ టార్గెట్ చేస్తోంది.ఇటీవల టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay )ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అది కూడా మోడీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో అరెస్ట్ చేయడం మరింత చర్చనీయాంశం అయిన సంగతి విధితమే.దీంతో మోడీ తెలంగాణ పర్యటనలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు.అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొనగా.తాజాగా ఆయన తెలంగాణకు వచ్చారు సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్( Vande Bharat Express ) ను ప్రారంభించిన మోడీ.
అనంతరం కేసిఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.కేంద్రనికి చెందిన చాలా ప్రాజెక్ట్ లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని, అందుకే కేంద్ర ప్రాజెక్ట్ లు ఆలస్యం అవుతున్నాయని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ది విషయంలో కేంద్రం నిబద్దతతో ఉందని చెప్పిన ఆయన.కొంతమంది మాత్రం అభివృద్ది పట్ల ఆందోళనగా ఉన్నారని, అలాంటి వారికి దేశ ప్రయోజనలతోనూ సమాజం తోను ఎలాంటి సంబంధం ఉండదని, తమ కుటుంబ మేలు మాత్రమే కోరుకుంటారని పరోక్షంగా కేసిఆర్ కుటుంబాన్ని ఊదేశించి చెప్పుకొచ్చారు.కుటుంబ పాలన అభివృద్ది వేర్వేరు కాదని, కుటుంబవాదం ఉన్న చోట అవినీతి ఉంటుందన్నారు.అవినీతి పరులను చట్ట ప్రకారం శిక్షించాలా వద్దా అంటూ ప్రశ్నించారు.మరోవైపు బిఆర్‌ఎస్ నేతలు మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.రాష్ట్రనికి నిధుల విడుదలలో జాప్యం వాస్తవం కదా అంటూ విమర్శలు చేస్తున్నారు.
నిజమైన తెలంగాణ ద్రోహులు ఎవరో ప్రజలకు తెలుసని మోడీకి( Narendra Modi ) చురకలు అంటిస్తున్నారు బిఆర్‌ఎస్ నేతలు.ఈ విధంగా ఇరు పార్టీల నుంచి వినిపిస్తున్న విమర్శలు ఆరోపణలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.