నిత్యం పెరుగుతో ఇలా చేశారంటే ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు!

సాధారణంగా కొందరికి ముఖంపై చాలా మచ్చలు ఏర్పడుతుంటాయి.ఆ మచ్చలు మన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.

 Try This Curd Mask For Spotless Skin! Curd Mask, Spotless Skin, Skin Care, Skin-TeluguStop.com

ఈ క్రమంలోనే ముఖంపై ఏర్పడిన మచ్చలు నివారించుకోవడం కోసం వేలకు వేలు ఖర్చుపెట్టి క్రీమ్, సీరం తదితర ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు.వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే పెరుగు మాస్క్ మాత్రం ముఖం పై మొండి మచ్చలను సైతం మాయం చేస్తుంది.క్లియర్ స్కిన్( Clear skin ) ను మీ సొంతం అయ్యేలా ప్రోత్సహిస్తుంది.

మరి ఇంతకీ పెరుగును ఉపయోగించి ముఖంపై మచ్చలను ఎలా పోగొట్టుకోవచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Curd Benefits, Curd, Face, Skin, Latest, Skin Care, Skin Care Tips,

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్లు నీరు తొలగించిన పెరుగును( curd ) వేసుకోవాలి.ఆరోగ్యానికి మాత్రమే కాదు పెరుగు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది.పెరుగులో ఉండే పోషకాలు చర్మాన్ని అందంగా మారుస్తాయి.

పెరుగు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ), వన్ టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్,( white vinegar ) హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic turmeric ) మ‌రియు రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Curd Benefits, Curd, Face, Skin, Latest, Skin Care, Skin Care Tips,

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.చివరిగా వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేశారంటే ముఖంపై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయమవుతాయి.పెరుగు, పసుపు, నిమ్మరసం, వెనిగర్.ఇవి నాలుగు మచ్చలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.వాటిని నివారించి ముఖాన్ని అందంగా ఆకర్షణీయంగా మారుస్తాయి.

పైగా ఈ రెమెడీని పాటిస్తే చ‌ర్మం తేమగా ఉంటుంది.కాంతివంతంగా మెరుస్తుంది.

ముడతలు ఉంటే త‌గ్గుముఖం ప‌డ‌తాయి.సాగిన చర్మం సైతం టైట్ గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube