శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు( Vajrapukottu ) మండలంలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలో ఎలుగుబంటి తిష్ట వేసింది.
ఎలుగుబంటి( bear ) గ్రామంలోకి రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
ఈ క్రమంలోనే ఎలుగుబంటి నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖాధికారులు ఎలుగుబంటిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.