శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి హల్‎చల్

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు( Vajrapukottu ) మండలంలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.

మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలో ఎలుగుబంటి తిష్ట వేసింది.ఎలుగుబంటి( Bear ) గ్రామంలోకి రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.ఈ క్రమంలోనే ఎలుగుబంటి నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖాధికారులు ఎలుగుబంటిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏంటి గోవా ఒక టూరిస్టు ట్రాపా.. దాన్ని బహిష్కరించాలంటూ నెట్టింట రచ్చ!