చనిపోయిన కుక్కని బతికించిన యువకుడు.. వీడియో వైరల్...!

రక్త ప్రసరణ, శ్వాస క్రియ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినప్పుడు దానిని వైద్య పరిభాషలో క్లినికల్ డెత్ అని పిలుస్తారు.ఇలాంటి సందర్భంలో గుండె సరిగా కొట్టుకోదు.

 The Young Man Who Revived The Dead Dog Video Viral Dog, Died, Viral Latest, New-TeluguStop.com

దీన్నే కార్డియాక్ అరెస్ట్ అని కూడా అంటారు.అయితే శ్వాస తీసుకోవడంతో పాటు శరీరంలో రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల మనుషులు లేదా జీవులు చనిపోయినట్లు పడిపోతాయి.

వెంటనే కాపాడకపోతే శాశ్వతంగా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులను లేదా జంతువులను కాపాడేందుకు సీపీఆర్ ప్రయోగిస్తారు వైద్యులు.

ఈ సీపీఆర్ వల్ల బాధిత వ్యక్తి శరీరంలోని గుండె సరిగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. రక్త ప్రసరణ నార్మల్ అవుతుంది.

శ్వాస వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది.దీనివల్ల బాధిత వ్యక్తి ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది.

అయితే సాధారణంగా ఇది కేవలం వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రమే చేస్తుంటారు.ఒక్కోసారి కొందరు పెద్ద మనసు చేసుకొని క్లినికల్ డెత్ అయిన మనుషులను, జంతువులను కాపాడుతుంటారు.

తాజాగా కూడా ఒక వ్యక్తి ఒక కుక్క ప్రాణాలను కాపాడి హీరో అనిపించుకుంటున్నాడు.దీనికి సంబంధించిన వీడియోని ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.“కొన్నిసార్లు మిరాకిల్స్ అంటే దయగల హృదయం గల మంచి వ్యక్తులు” అని అధికారి పేర్కొన్నారు.షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది.

వైరల్ వీడియోలో ఒక తెల్ల కుక్క నిర్జీవంగా పడి ఉండటం చూడవచ్చు.అయితే దీనిని బతికించేందుకు ఒక యువకుడు దాని గుండెలపై గట్టిగా నొక్కుతూ సీపీఆర్ ప్రయోగించాడు.చాలా వేగంగా చాలాసేపు సీపీఆర్ చేశాక ఆ కుక్క బతికింది.అది తన కాళ్ళపై మళ్లీ తాను నిలబడగలిగింది.దీంతో వీడియో ముగుస్తుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్‌గా కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోకి ఇప్పటికే రెండు లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube