13 ఏళ్ల నిరీక్షణ.. ఆ సినిమా సీక్వెల్ కోసం.. ప్రపంచమే ఎదురుచూస్తోంది?

ఒక సినిమా విడుదలై సూపర్ హిట్ అయిందంటే చాలు.ఆ సినిమాకు సీక్వెల్ వస్తుందని ప్రేక్షకులు బలంగా నమ్ముతూ ఉంటారు.

 The World Is Waiting To Watch Avatar Sequel Avatar Sequel, Avatar , Cameroon ,-TeluguStop.com

ఇక మొదటి సినిమాకు వచ్చిన క్రేజ్ తోనే ఆ సినిమాకు సీక్వెల్ కూడా తీసి అద్భుతమైన విజయాన్ని సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటారు దర్శకులు.ఇటీవలి కాలంలో సీక్వెల్ సినిమాల హవా ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే.

బాహుబలి సినిమా తెరకెక్కించగా.ఎలాంటి అంచనాలు లేవు.

కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇండియాలోనే కాదు వరల్డ్వైడ్గా కూడా సూపర్ హిట్.

దీంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ లేనంత బజ్ బాహుబలి సీక్యల్ కు వచ్చింది.ఇక ఈ సినిమా ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించినా విషయం తెలిసిందే.

మొన్నటికి మొన్న వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టినా కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా కూడా అంతే.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజిఎఫ్ సినిమా బ్లాక్బస్టర్ సాధించింది.

ఇక ఈ సినిమా తర్వాత సీక్వెల్ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసారు.ఇటీవలే వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా అఖండ విజయాన్ని సాధించింది అని చెప్పాలి.

ఇప్పుడు ఒక దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఒక సినిమా గురించి కళ్ళల్లో వొత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు.

Telugu Avatar, Avatar Sequel, Avatarsequel, Bahubali, Cameroon, Kgf-Latest News

కొన్ని రోజుల నుంచి కాదు కొన్ని నెలల నుంచి కూడా కాదు దాదాపు 13 ఏళ్ల నుంచి ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు.అదే అవతార్ సినిమా. 2009లో విడుదలైన అవతార్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సక్సెస్ సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.1822 కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా 22 వేల కోట్లు వసూలు సాధించింది .ఇక ఈ సినిమా సీక్వెల్ రాబోతుంది అంటూ దర్శకుడు కామెరూన్ ఇక వరుసగా అప్డేట్ లు ఇస్తూ ఉండడం తో ప్రేక్షకుల్లో మరింత ఆతృత పెరిగిపోతుంది.ఇలాంటి హైప్ క్రియేట్ కావడం మాత్రం చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube