ముస్లిం దేశాల్లో ఉగ్రవాదం( terrorism ) పెచ్చరిల్లుతోంది.ఇటీవల కాలంలో ఆత్మహతి దాడులు బాగా పెరుగుతున్నాయి.
రీసెంట్ గా టర్కీలో( Turkey ) ఈ తరహా ఘటన జరిగింది.ఓ సూసైడ్ బాంబర్ అంకారాలో ఆదివారం పార్లమెంట్ సమీపంలో తనను తాను పేల్చేసుకున్నాడు.
దాడి జరిగిన ప్రదేశం నుంచి కొన్ని కిలోమీటర్ల మేర ఈ పేలుడు శబ్దం వినిపించింది.
అంకారాలోని టర్కీ పార్లమెంట్ భవనంపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు.ఒక ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోగా, మరొకరు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు.ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు.
పార్లమెంటు మళ్లీ సమావేశమయ్యే కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది.అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో ( President Recep Tayyip Erdogan )సహా పార్లమెంటేరియన్లందరూ మధ్యాహ్నం పార్లమెంటుకు హాజరుకావాల్సి ఉంది.
విద్యుత్ లైన్‌ను ఢీకొని ఓహియో నదిలో కూలిపోయిన సీప్లేన్.ఇద్దరు వ్యక్తులకు గాయాలు.
టర్కీ అధికారులు ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌పై ఆపరేషన్లు చేస్తుండగా ఈ దాడి జరిగింది.ఉదయం 9:30 గంటలకు, ఇద్దరు ఉగ్రవాదులు లైట్ కమర్షియల్ వెహికల్ లో టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రవేశ ద్వారం వద్దకు వచ్చి బాంబు దాడికి పాల్పడ్డారు.ఒక తీవ్రవాది బాంబు పేల్చాడు, ఆత్మహత్య చేసుకోగా ఆ సమయంలో ఇద్దరు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారు.ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో భవనం ముందు పోలీసులు పరిగెడుతుండగా, ఒక సూసైడ్ బాంబు పేలడం చూడవచ్చు.మంటలు, పొగ ఎగిసిపడటం కూడా గమనించవచ్చు.