నిన్న మొన్నటివరకు ఇండియన్ కరెన్సీ రూపీని( Indian currency Rupee ) చిన్నచూపు చూసిన అమెరికా నేడు రూపీ వైపు తొంగి చూడడం కొసమెరుపు.నాటినుండి నేటివరకు ప్రపంచంపై పెత్తనం చెలాయించిన అమెరికా.
( America ).ఇకపై తన ప్రాభవం కోల్పోవలసిన గడ్డు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇండియావైపు చూస్తోంది.గ్లోబల్ కరెన్సీగా అమెరికన్ డాలర్ కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది.డాలర్( Dollar ) కు వ్యతిరేకంగా సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటమే దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.
ఈ జాబితాలో ఇప్పుడు భారత్ కూడా దూసుకుపోవడం విశేషం.
ఇపుడు దాదాపు అన్ని దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అమెరికన్ డాలర్లే 60 శాతానికి పైగా ఉన్నాయి.అయితే ఇక మునుపు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు.ఇన్నాళ్లు అమెరికా పెత్తనాన్ని మౌనంగా భరించిన వివిధ ప్రపంచ దేశాలు.
ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాయి.ఇదే క్రమంలో సొంత కరెన్సీని బలోపేతం చేసుకోవాలనే కోరికతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుపోవడంతో అమెరికాకు ముచ్చెమటలు పడుతున్నాయి.
అయితే ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోనే ఉంది.మున్ముందు బలోపేతమైతే డాలర్ గ్లోబల్ కరెన్సీ స్థానాన్ని కోల్పోయే రోజులు ఎంతో దూరంలో లేవని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
ఇకపోతే క్రీమియా ఆక్రమణ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలు ఎదుర్కొనేందుకు 2014లో రష్యా చైనాతో చేతులు కలిపి డాలర్ కు వ్యతిరేకంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది.దీంతో గ్లోబల్ కరెన్సీగా చలామణి అవుతున్న అమెరికన్ డాలర్ కు ఈ ఒప్పందం పెద్ద సవాలుగా మారింది.అదే విధంగా డాలర్ స్థానంలో తమ సొంత కరెన్సీ లోనే వ్యాపార నిర్వహించాలని ఇటీవల చైనా, బ్రెజిల్ ఓ నిర్ణయానికి ఒచ్చాయి.ఇపుడు భారత్ వంతు వచ్చింది.
రష్యా, భారత్ మధ్య కూడా ఇండియన్ కరెన్సీని వారధిగా మారింది.రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఆవిష్కరించే దిశలో భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
దాంతో పెద్దన్న అమెరికా ఇక ప్రపంచ దేశాలకి తలవంచక తప్పదని నిపుణులు చెబుతున్నారు.