ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో నటుడు సిద్ధార్థ్( Siddharth ) ఒకరు ఈయన హీరోగా బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.అదే ఇటీవల కాలంలో సిద్ధార్థ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి.
ఇకపోతే ఈయన తన కెరీర్ లో నటించినటువంటి సినిమాలలో ఓయ్( Oy Movie )సినిమా ఒకటి.డైరెక్టర్ ఆనంద్ రంగా( Anand Ranga ) దర్శకత్వంలో తెరకేక్కినటువంటి ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన షామిలి( Shamili ) హీరోయిన్గా నటించారు.

అద్భుతమైనటువంటి ప్రేమ కథ( Love Story ) సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం 2009వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా అప్పట్లో పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.ఈ సినిమా కథ మ్యూజిక్ పాటలు అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎందుకు ఈ సినిమాని ఆదరించలేకపోయారు.ఇక చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా ప్రేమికుల దినోత్సవాన్ని( Valentines Day ) పురస్కరించుకొని తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ సినిమాకు ఓయ్ అని టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయం వైరల్ అవుతుంది.ఈ సినిమాలో హీరోయిన్ హీరోని ఓయ్ అంటూ పిలుస్తూ ఉంటారు అందుకే ఈ సినిమాకు ఇదే టైటిల్ పెట్టారు అని చాలామంది అనుకుంటారు కానీ ఈ సినిమా టైటిల్ వెనుక చాలా కారణం ఉందని తెలుస్తోంది.ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పరిచయం 2007 జనవరి ఒకటవ తేదీ జరుగుతుంది అయితే ఆమెకు క్యాన్సర్ ఉండటంతో హీరోయిన్ అదే ఏడాది డిసెంబర్ 31వ తేదీ చనిపోతుంది.
ఇలా వీరి ప్రయాణం వన్ ఇయర్ సాగుతుంది.OY అంటే one year అంటూ అర్థం వచ్చేలా డైరెక్టర్ ఈ సినిమాకు ఓ అని టైటిల్ పెట్టినట్లు తాజాగా ఈ వార్త వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.