తెలంగాణలో ఎన్నికల నగార మొదలైంది.అందరూ ఊహించినట్టుగానే నవంబర్ లో ఎలక్షన్స్ జరగనున్నాయి.
నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3 న ఫలితాలు వెలువడనున్నాయి.ఈసారి తెలంగాణ ఎలక్షన్ వార్ చాలా ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే అధికార బిఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా బలంగానే పుంజుకున్నాయి.దాంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఎవరికి వారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
అధికార బిఆర్‌ఎస్ 100కు పైగా స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుంటే.కాంగ్రెస్, బీజేపీలు అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి.

దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్‌ఎంసి ఎలక్షన్స్,.ఇలా ఆయా ఎన్నికలలో బీజేపీ సత్తా చాటింది.ఇక కర్నాటక ఎన్నికల్లో విజయం తరువాత కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ముందుకొచ్చింది.
తెలంగాణలో కాంగ్రెస్( Telangana congress ) విజయం సాధిస్తుందని హస్తం పార్టీ నేతలు నమ్ముతున్నారు.ఇప్పటికే ఆ పార్టీలో చేరికలు కూడా బాగానే జరుగుతున్నాయి.సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీ విజయం సాధించి మొదటి ప్లేస్ కు చేరుకుంటుంది.
ఏ ఏ పార్టీలు రెండు మూడు స్థానాలకు పరిమితం అవుతాయి అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

బిఆర్‌ఎస్ పార్టీ ( BRS party )ఈసారి రెండో స్థానానికి పరిమితం అవుతుందని కాంగ్రెస్ చెబుతుంటే.లేదు లేదు కాంగ్రెస్ రెండో స్థానానికి చేరుకొని.బీజేపీ మొదటి ప్లేస్ లో విజయం సాధిస్తుందని కమలనాథులు చెబుతున్నారు.
ఇక బిఆర్‌ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టిగా చెబుతున్నాయి.అయితే ఇప్పటివరకు వెలువడిన జాతీయ సర్వేలను గమనిస్తే మొదటి ప్లేస్ కంటే కూడా రెండో ప్లేస్ కోసం గట్టిగా పోటీ కనిపిస్తోంది.
కొన్ని సర్వేల్లో బీజేపీ రెండో ప్లేస్ లో ఉంటే.మరికొన్ని సర్వేల్లో కాంగ్రెస్ రెండో ప్లేస్ లో ఉంది.దీంతో ఈ ఎన్నికల్లో అసలైన పోటీ రెండో స్థానం కోసమేనా అని రాజకీయా వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఎందుకంటే బిఆర్‌ఎస్ అధికారం ఖాయమైతే.
ప్రతిపక్ష హోదాలో బీజేపీ కాంగ్రెస్( Congress party ) మద్య అసలైన పోటీ అనేది కొందరి వాదన.మరి ఈ రెండు పార్టీలు ఏ ప్లేస్ లో నిలుస్తాయో చూడాలి.