మూడు ల‌క్ష‌లు కొట్టేసిన కోతి.. చివ‌ర‌కు ఏమైందంటే..?

సాధారణంగా మనుషులు మాత్రమే డబ్బులను దొంగతనం చేస్తుంటారు.కానీ, మనం తెలుసుకోబోయే ఈ ఘటనలో కోతి దొంగతనం చేసింది.

 The Monkey Theft Three Lakhs What Happened In The End, Monkey, Viral News, Monke-TeluguStop.com

ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగింది? తిరిగి కోతిని పట్టుకున్నారు? దొంగతనానికి గురైన వ్యక్తి ఎవరికి కంప్లయింట్ చేశాడు? పోలీసులు మనీని ఎలా రికవర్ చేశారు? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదివి తీరాల్సిందే.

మారుతున్న పరిస్థితులతో అడవులు మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి.

ఈ క్రమంలోనే ఫారెస్ట్ అనేది లేకుండా పోయే పరిస్థితులు భవిష్యత్తులో ఏర్పడకుండా చేసేందుకుగాను ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.అటవీ ప్రాంతాల రక్షణకు కృషి చేస్తున్నాయి.

అయితే, అడవుల నుంచి కోతులు జనావాసాల్లోకి ఎప్పుడో వచ్చేశాయి.పుణ్యక్షేత్రాల్లో అయితే ఏకంగా భక్తుల కొబ్బరికాయలు, ఆహారపదార్థాలను గుంజుకుని మరి తింటుంటాయి.

అలాంటి ఘటనలు మనం చూడొచ్చు.కాగా, ఇక్కడ ఓ కోతి మాత్రం ఏకంగా డబ్బులున్న బ్యాగునే దొంగిలించింది.

ఎక్కడంటే.ఉత్తరప్రదేశ్‌ స్టేట్‌లోని హార్దోయి డిస్ట్రిక్ట్ సాండీ పోలిస్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన ఆశిష్ సింగ్ అనే పర్సన్ బైక్ నిలిపి ఉంచాడు.తన బైక్ లో రూ.3 లక్షలున్న ఓ కవర్‌ను ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.అయితే, అప్పటికే ఆ ఏరియాకు వచ్చిన ఓ మంకీ బైక్‌లో ఉన్న మనీ కవర్‌ను దొంగిలించింది.

Telugu Aashish Singh, Hardoi, Monkey, Monkey Theft, Security Guard, Rupees, Utta

అది గమనించిన బైక్ ఓనర్ ఆశిష్ సింగ్ మంకీ నుంచి డబ్బులు తీసుకునేందుకు విఫలయత్నం చేశాడు.కోతి ఆ డబ్బున్న బ్యాగను తీసుకుని వెళ్లిపోయింది.ఈ క్రమంలోనే సదరు వ్యక్తి వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు.

అయితే, కొద్దిసేపటికి మంకీ సదరు బ్యాగును కింద పడేసింది.అది చూసిన ఓ సెక్యూరిటీ గార్డు ఆ విషయం ఆశిష్ సింగ్‌కు తెలిపాడు.

దాంతో కంప్లయింట్ విత్ డ్రా చేసుకున్నాడు.ఇక నిజాయితీగా డబ్బులున్న బ్యాగును గురించి తెలిపిన సదరు సెక్యూరిటీ గార్డ్‌ను పోలీసులు అభినందించారు.

ఇక తన డబ్బు తనకు తిరిగొచ్చినందుకుగాను ఆశిష్ సంతోషం వ్యక్తం చేశాడు.మంకీకి థాంక్స్ కూడా చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube