వామ్మో.. భారీ లివింగ్ డైనోసార్ చేపను పట్టుకున్న వ్యక్తి..!

సాధారణంగా మనం చెరువులు, నదులలో దాదాపు 30 నుంచి 40 కేజీల బరువు ఉండే చిన్న చిన్న చేపలను చూస్తూ ఉంటాము కదా.ఒక్కోసారి 100 కేజీల బరువు ఉండే భారీ చేపలు సైతం వలలో చిక్కుతూ ఉంటాయి.

 The Man Who Caught The Huge Living Dinosaur Fish, Living Dinosaur , Social Media-TeluguStop.com

అలాంటి భారీ చేపలను చూడడానికి జనాలు సైతం పరుగులు పెడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే ఓ వ్యక్తి 159 కిలోల బరువున్న సజీవ డైనోసార్ చేపను పట్టుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచేసాడు.

వివరాల్లోకి వెళితే.కెనడాలోని అల్బెర్టా లో 8 అడుగుల 6 అంగుళాల పొడవున్న స్టర్జన్ చేపను పట్టుకున్నాడు.

ఈ సర్జన్ చేపను ‘లివింగ్ డైనోసార్‘ అని కూడా అక్కడ ప్రాంతం వాసులు పిలుస్తూ ఉంటారు.

ఈ లివింగ్ ఫిష్ సుమారు 159 కిలోల బరువు ఉంటుంది.

ఈ స్టర్జన్‌ చేపలు జురాసిక్ యుగం నుంచి ఉంటున్నాయని, వీటిని బతికున్న డైనోసార్స్ అని కూడా అంటారు అని పరిశోధకులు చెబుతున్నారు. బ్రేడెన్ రూస్ ఫ్రేజర్ అనే వ్యక్తి ఒక నదిలో ఈ చేపను పట్టిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త ఇప్పుడువైరల్ గా మారింది.

కాగా అతను ఈ చేపను పట్టే క్రమంలో అది తనను దాదాపు ఒక కిలో మీటర్ మేరకు వెనక్కి లాక్కెల్లిందని చెప్పుకోచ్చారు.ప్రస్తుతం ఈ లివింగ్ డైనోసార్ కి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ డైనోసార్ చేపలు ట్రయాసిక్ కాలంలో అంటే సుమారు 245-208 మిలియన్ సంవత్సరాల క్రితం శిలాజ రికార్డులో మొదటిసారిగా కనిపించాయట.ఈ ఆదిమ చేపలలో సుమారు 29 జాతులు ఉన్నాయి.

వాటిలో ఈ స్టర్జన్ చేప అనేది ఒక సాధారణ పేరుగా పేర్కొంటున్నారు పరిశోధకలు.ఈ చేప నోటిలో దంతాలు ఉండవని పరిశోధకులు చెప్తున్నారు.

అలాగే ఈ చేపలు మనుషులకు ఎలాంటి హానిని తలపెట్టవని చెబుతున్నారు.ఇవి సగటున ఏడు నుంచి పది అడుగుల పరిమాణంలో పెరుగుతాయి.

అలాగే 26 అడుగుల కంటే ఎక్కువ కూడా పెరిగే చేపలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube