కెనడా( Canada ) పౌరులకు వీసా సేవలను నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.దాంతో కెనడియన్లు భారతదేశాన్ని సందర్శించడానికి వీసా పొందడం ఇప్పుడు అసాధ్యంగా మారింది.
కెనడాలో సిక్కు వేర్పాటువాద నాయకుడిని హత్య చేయడంలో భారత్( India ) ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ మాటలకు రియాక్షన్‌గా భారత్ వీసా సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
ఆ ఆరోపణను భారత్ ఖండించింది.అంతేకాదు కెనడా ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశమని పేర్కొంది.
అందుకే వీసాలు బ్యాన్ చేస్తున్నట్లు వెల్లడించింది.

ఈ నిర్ణయం కెనడాలో నివసిస్తున్న పంజాబ్‌కు( Punjab ) చెందిన ప్రవాస భారతీయులపై (ఎన్నారైలు) ప్రభావాన్ని చూపుతుంది.ఎందుకంటే చాలా మంది ఎన్నారైలు తమ స్వస్థలాలను సందర్శించడానికి, వారి కుటుంబాలతో పండుగలను జరుపుకోవడానికి శీతాకాలంలో భారతదేశానికి వెళతారు.

పంజాబ్( Punjab ) నుంచి చాలా మంది ఎన్నారైలు పండుగ సీజన్ ప్రారంభానికి ముందు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారతదేశానికి ప్రయాణిస్తారు.కొందరు వివాహాలకు హాజరుకావాలని లేదా వారి కుటుంబాలతో కలిసి లోహ్రీని జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఇప్పుడు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) కార్డులు ఉన్న వ్యక్తులు తప్ప మిగతా వారు భారతదేశానికి రాలేరు.
వీసా కావాల్సిన వారు వీసా సేవలు కూడా పునఃప్రారంభించేంతవరకు వేచి ఉండాల్సిందే.దౌత్యపరమైన వివాదం పంజాబ్‌లోని ప్రయాణ పరిశ్రమకు కూడా సమస్యలను కలిగించింది.వీసా దొరక్క ఆందోళన చెంది కొందరు ఎన్నారైలు తమ రిజర్వేషన్లను రద్దు చేసుకున్నారు.OCI కార్డ్ అనేది లాంగ్ టర్మ్ వీసా, ఇది భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు భారతదేశంలో నివసించడానికి, పని చేయడానికి అనుమతిస్తుంది.
అయితే, ఇది వారికి భారతీయ పౌరులకు సమానమైన హక్కులను ఇవ్వదు.ఉదాహరణకు, OCI కార్డ్ హోల్డర్లు భారతదేశంలో ఓటు వేయలేరు.