క్లాత్‌లో చిక్కుకున్న నక్కని దేవుడిలా వచ్చి కాపాడారు.. హార్ట్ టచ్ వీడియో వైరల్..!

ఒక్కోసారి జంతువులు మనుషులు వదిలేసిన చెత్త చెదారం కారణంగా తమ ప్రాణాలను పోగొట్టుకుంటాయి.ఇప్పటికే ఎన్నో జీవులు మనుషుల నిర్లక్ష్యం వల్ల అత్యంత దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలను వదిలాయి.

 The Fox Trapped In The Cloth Came Like A God And Was Rescued Dog, Viral Latest,-TeluguStop.com

అయితే తాజాగా ఒక నక్క కూడా ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకుపోయింది.ఈ నక్క రోడ్డు పక్కనే వదిలేసిన ఒక క్లాత్‌లో చిక్కుకుపోయింది.

ఈ క్లాత్ సగం రోడ్డులో సగం భూమిలో పూడుకుపోయింది.అయితే రోడ్డుపైన ఉన్న సగభాగం దుస్తుల్లో ఈ నక్క ముందు కాలు ఇరుక్కుపోయింది.

అయితే ఆ ఉచ్చు నుంచి బయటపడేందుకు నక్క చాలా ప్రయత్నించింది.అప్పటికే అది విపరీతంగా అలిసిపోయింది.

కానీ బయట పడటం సాధ్యం కాకపోవడంతో నక్క తన ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంది.

ఈ క్రమంలోనే అటు వైపుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఈ నక్కను చూసారు.

తరువాత దాన్ని కాపాడాలని ముందుకొచ్చారు.వాళ్లని చూసిన నక్క చాలా భయపడిపోయింది.

మనుషులు తనని చంపేస్తారేమో అని అది చాలా దయనీయంగా ఒక లుక్ ఇచ్చింది.అయితే తర్వాత ఆ నక్కను కాస్త శాంతపరచి ఆపై క్లాత్ ని కట్ చేశారు.

అనంతరం దాన్ని చాలా స్లోగా వదిలేశారు.గుడ్డలో చిక్కుకుపోయి నరకయాతన అనుభవించిన నక్కకి స్వేచ్ఛ అందించారు.

అలా దేవుడిలా వచ్చి దాని ప్రాణాలను కాపాడారు.అయితే ఉచ్చు నుంచి బయటపడటంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న నక్క అడవి లో పడి హాయిగా పరిగెత్తింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈ హార్ట్ టచింగ్ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube