మనకు అకస్మాత్తుగా టపాసులు శబ్ద నిలబడితే ఒకసారి మనం హడలిపోతాం.అదే టపాసుల శబ్దం మనం ఎటూ పోలేని పరిస్థితి లో ఉన్నప్పుడు అదే పనిగా వస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
ఒక్కసారిగా భయం వేయడం ఖాయం.ఇలాంటి సంఘటన జరిగింది.
టపాసులు పేల్చడం అనేది ఒక ప్రెస్టేజిలా ఫీలయ్యే మహానుభావులు కూడా ఉన్నారు.ఎదుటి వారు ఎంతవి తెస్తే, నేను అంతకు డబల్ ఖర్చు చేసి కొనాలని ఇతరులతో పోల్చుకొని మన స్వార్థం కోసం ఇతరులు మన వల్ల ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారనేది మనం అంతగా పట్టించుకోము.
అయితే మూగజీవాలు చిన్న శబ్దం అయితేనే హడలెత్తి పోతాయ్.మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలియదు కదా.అవి ఎక్కువగా కంగారు పడుతుంటాయి.అచ్చం ఇలాగే చైనాలో ఓ సంఘటన జరిగింది.
చైనాలో నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులలో ఆ టపాసుల శబ్దానికి భయపడ్డ కుక్క అక్కడ నుండి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వెనక ఉన్న గోడ వెనుక దాక్కోవడంతో గోడకు రంధ్రం ఉండడంతో అందులో ఇరుక్కుపోయి ఎటూ కదల్లేని స్థితిలోకి వెళ్లిన ఆ కుక్కను బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించగా వారు వచ్చి కుక్కకు ఎటువంటి గాయాలు లేకుండా బయటకి తీసుకొచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు కుక్క సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది.ఎంతో ఉత్కంఠను కలిగిస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం.వీడియోపై ఓ లుక్కెయ్యండి మరి.