ప్రచారంలో వెనుక బడ్డ కాంగ్రెస్... హుజురాబాద్ లో పోటీకి నో చెప్పినట్టేనా?

తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక  రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం హుజూరాబాద్ లో గెలవాలని ప్రస్తుతం లీడ్ లో ఉన్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రకరకాల వ్యూహాలు  పన్నుతున్న విషయం తెలిసిందే.

 The Congress Behind The Campaign Did You Say No To The Contest In Huzurabad, Con-TeluguStop.com

అయితే ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ తప్ప మిగతా పార్టీలు ఏవీ జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న దాఖలాలు లేవు.అయితే  రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్ తరువాత  రెండో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ఇటుబీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొందన్న విషయం తెలిసిందే.

అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేయడంపై క్లారిటీ లేని పరిస్థితి ఉంది.అంతేకాక రేవంత్ రెడ్డి ఒకానొక సందర్భంలో హుజూరాబాద్ లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని, పోటీ చేయడం అనర్థమని చెప్పిన సందర్భం కూడా ఉంది.

అందుకు నిరసనగానే హుజూరాబాద్ లో కాంగ్రెస్ ను పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు కాంగ్రెస్ పోటీపై క్లారిటీ ఇవ్వడం లేదు.

అయితే కాంగ్రెస్ అంతర్గతంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ప్రస్తుతం చాలా వరకు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ ఉందన్న విషయం పలు సర్వేల ద్వారా తెలుస్తున్న పరిస్థితి ఉంది.

అందుకే కాంగ్రెస్ కూడా పోటీకి దూరంగా ఉన్న పరిస్థితి ఉంది.అయితే అధికారికంగా పోటీకి దూరంగా ఉంటున్నామని కాంగ్రెస్ చెబుతుందా లేక అనధికారికంగా బీజేపీ పార్టీ కి సపోర్ట్ చేస్తుందా లేక న్యూట్రల్ గా ఉంటుందా అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube