యాదాద్రి భువనగిరి జిల్లా:బీబీనగర్ మండలం బట్టుగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన క్షుద్రపూజల వ్యవహారం గ్రామంలో కలకలం రేపింది.గురువారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు స్టాఫ్ రూమ్ ముందు నిమ్మకాయలు,కోడిగుడ్లతో క్షుద్రపూజలు చేసినట్లుగా ఉన్న ఆనవాళ్లను చూసి పోలీసులకు సమాచారం అందించారు.
ఉపాధ్యాయుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.ఇది కావాలని చేశారా? లేక ఎవరైనా ఆకతాయిలు ఉపాధ్యాయులను,పిల్లలను ఆట పట్టించడానికి చేశారా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.