ప్రెషర్ కుక్కర్ తో కొట్టి ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు..!

ఇటీవలే కాలంలో పొంతన లేని అనుమానాలతో తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు.తన లైవ్-ఇన్ పార్టనర్ పై అనుమానంతో ఇంట్లో ఉండే ప్రెషర్ కుక్కర్ తో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన బెంగుళూరు నగరంలో చోటుచేసుకుంది.

 The Boyfriend Killed His Girlfriend By Hitting Her With A Pressure Cooker..! ,be-TeluguStop.com

అసలు హత్యకు గల కారణాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

కర్ణాటక రాజధాని బెంగుళూరు( Bengaluru )లో ఓ ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న వైష్ణవ్, పద్మాదేవి లు ప్రేమించుకుని గత రెండేళ్లుగా నగరంలోని ఒక అద్దె ఇంట్లో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు.వైష్ణవ్ (24) స్వస్థలం కొల్లం జిల్లా.

పద్మావతి స్వస్థలం తిరువనంతపురంలోని అట్టింగల్.వీరి మధ్య బంధం కొంత సాఫీగానే సాగింది.

కానీ పద్మాదేవికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానం వైష్ణవ్( Vaishnav ) లో బలంగా ఉండేది.శనివారం పద్మాదేవికి వచ్చిన ఫోన్ కాల్ పై ఆవేశంతో వైష్ణవ్ గొడవపడ్డాడు.వీరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.క్షణికావేశంలో తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయినా వైష్ణవ్ ఇంట్లో ఉండే ప్రెజర్ కుక్కర్( Pressure Cooker ) తో పద్మాదేవీ తలపై బలంగా కొట్టాడు.

తీవ్ర రక్తస్రావం కావడంతో క్షణాల్లో పద్మాదేవి కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నగరంలోని న్యూ మైకో లేఅవుట్ లో శనివారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించారు.పద్మాదేవి మృతిచెందిన వెంటనే వైష్ణవ్ అక్కడి నుంచి పరారయ్యాడు.అయితే పోలీసులు నిందితుడిని ఆదివారం తెల్లవారుజామున అరెస్టు( Arrested ) చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సికే బాబా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube