కరోనా మహమ్మారి పేరు చెప్తే ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడుతాయి, కానీ ప్రస్తుతానికి అమెరికా మాత్రం కరోనా పేరు వింటే గజగజ వణికిపోతోంది.కరోనా ప్రభావం అన్ని దేశాలలో తగ్గుముఖం పడుతుంటే అమెరికాలో మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
ఒక పక్క అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా చేస్తూండగానే మరో పక్క కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.మరణాల సంఖ్య రోజుకు 2 వేలకు చేరుకుంది.
ఈ నేపధ్యంలో కరోన మహమ్మారి అమెరికా చరిత్రలో అతిపెద్ద రోగంగా నిలిచిందని, కరోనా కేసులపై తీవ్రతపై అధ్యయనం చేసిన జాన్ హొప్కిన్స్ వర్సిటీ ప్రకటించింది.
ఈ అధ్యయనం ప్రకారం జాన్ హొప్కిన్స్ వర్సిటీ అధ్యయనం ప్రకారం 1918 లో వచ్చిన ఫ్లూ ఎంతటి భయానక పరిస్థితులను సృష్టించిందో అందరికి తెలిసిందే.
ఈ మహమ్మారి భారిన పడి లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.అప్పటి ఈ సంఘటన తలుచుకుంటే ఇప్పటికి అమెరికన్స్ లో వణుకు పుట్టుకొస్తుంది.అయితే కరోన ముందు ఫ్లూ దిగదుడుపు అంటున్నారు శాస్త్రవేత్తలు.కరోన మరణాలతో పోల్చితే ఫ్లూ మరణాలు ఓ మూలకు కూడా రావని తేల్చి చెప్తున్నారు.

హొప్కిన్స్ వర్సిటీ ,సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనం ప్రకారం, 1918 లో అమెరికాను అతలాకుతలం చేసిన ఫ్లూ మహమ్మారి అప్పట్లో దాదాపు 6.75 వేల మందిని కబళించింది.అప్పట్లో ఫ్లూ అతిపెద్ద మహమ్మారిగా అభివర్ణించింది అమెరికా.కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని కరోన భర్తీ చేసింది.ప్రస్తుతం అమెరికాలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 6.75 వేల పై మాటే రోజు వారి కేసులతో పోల్చితే ఇది మరో వారం రోజుల్లో ఏడు లక్షల కేసులకు వెళ్ళినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.పరిశీలకులు.ఒక పక్క వ్యాక్సినేషన్ జరుగుతున్నా సరే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు.