60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన ఏఐ.. వీడియో వైరల్..

అస్సాం రాష్ట్రంలో( Assam ) ఒక అద్భుతమైన సంఘటన జరిగింది.అక్కడ రాత్రి వేల రైలు పట్టాల మీదకు ఒక ఏనుగుల గుంపు వచ్చింది.

 The Ai ​​video That Saved The Lives Of 60 Elephants Went Viral, Artificial I-TeluguStop.com

అదే సమయంలో ఆ పట్టాల మీద ఒక ట్రైన్ దూసుకొస్తోంది.చివరి నిమిషంలో ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది.

అదెలాగంటే, ఒక స్మార్ట్ ఏఐ సిస్టమ్ ( Smart AI system )ఏనుగుల గుంపు గురించి లోకో పైలట్లకు తెలియజేసింది.దాంతో వారు వెంటనే అప్రమత్తమై ట్రైన్ ఆపేశారు.

అలా ఏఐ చాలా ఏనుగుల ప్రాణాలు కాపాడి దాని వల్ల ఎన్ని ప్రయోజలు ఉన్నాయో చెప్పకనే చెబుతోంది.

వివరాల్లోకి వెళితే, అక్టోబర్ 16వ తేదీ రాత్రి 8:30 గంటలకు హవాయిపూర్ – లాంసాఖాంగ్ స్టేషన్ల( Hawaiipur – Lansakhang Stations ) మధ్య ఉన్న రైలు పట్టాలను ఏనుగుల గుంపు దాటింది.గౌహతి నుంచి లమ్డింగ్‌కు వెళ్తున్న కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ( Kamrup Express Train )అదే పట్టాలపై వెళ్లింది.ఏనుగులు దాటుతున్న సమయంలో అది వాటికి చాలా దగ్గరగా వచ్చింది.

రైలు డ్రైవర్ జె.డి.దాస్, హెల్పర్ ఉమేష్ కుమార్‌లు( JD Das, Helper Umesh Kumar ) ఈ ఏనుగుల గుంపును చూసి వెంటనే రైలును ఆపారు.ఈ సమయంలో, రైలులో ఉన్న ఒక స్మార్ట్ సిస్టమ్ కూడా ఈ ఏనుగుల గురించి తెలుసుకొని రైలు డ్రైవర్‌కు హెచ్చరిక ఇచ్చింది.

అంటే, ఈ స్మార్ట్ సిస్టమ్ లేకపోతే రైలు ఏనుగులను గమనించకపోవచ్చు.ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.ఈ సంఘటన ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఎలా మనకు సహాయపడుతుందో అర్థమవుతోంది.ఈ రైలు పట్టాల దాదాపు 60 ఏనుగులు దాటుతున్నట్లు అధికారులు చెప్పారు.ఈ విషయం తెలియకపోతే పెద్ద ప్రమాదం జరిగేది.కానీ, ఆ రైలులో “ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్” ( Intrusion Detection System )అనే స్మార్ట్ సిస్టమ్ ముందుగానే ఏనుగుల గురించి రైలు డ్రైవర్‌కు, హెల్పర్‌కు తెలియజేసింది.

వెంటనే వాళ్లు రైలును ఆపడానికి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు.

దేశంలోని ఈస్ట్ సెంట్రల్ రైల్వే డిపార్ట్‌మెంట్ ఏనుగులను కాపాడటానికి చాలా కృషి చేస్తోంది.ఏనుగులు అడవుల నుండి ఆహారం కోసం బయటకు వచ్చేటప్పుడు రైలు పట్టాలు దాటడం కామన్.ఇలా దాటేటప్పుడు అనేక ఏనుగులు రైళ్ల కింద పడి చనిపోతున్నాయి.

ఈ విషయం గమనించిన రైల్వే శాఖ, ఏనుగులు తిరిగే ప్రాంతాల్లో ఉన్న రైలు పట్టాలకు ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్‌లు ఏర్పాటు చేస్తోంది.ఈ సిస్టమ్‌ల వల్ల ఏనుగులు పట్టాలపైకి వస్తున్నాయని ముందే తెలుసుకొని రైళ్లను ఆపవచ్చు.

గత సంవత్సరం, ఈ రైల్వే శాఖ 414 ఏనుగులను ఈ విధంగా కాపాడింది.ఈ సంవత్సరం జనవరి నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు 383 ఏనుగులను కాపాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube