రీల్స్ పిచ్చిలో పడి మరో యువకుడు బలి.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే కోరిక చాలామంది ప్రాణాలను బలి తీసుకుంటోంది.ఇప్పటికే ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత రీల్స్ ( Youth Reels )మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.

 The Video Of Another Young Man's Death In Reel Madness Has Gone Viral, Social Me-TeluguStop.com

ఇటీవల ఆగ్రాలో జరిగిన మరో విషాద సంఘటన అందరినీ కలచివేసింది.సోషల్ మీడియాలో రీల్స్ చేయాలనే తపనలో ఒక యువకుడు తన ప్రాణాలను కోల్పోయాడు.

తన వీడియోకి మరింత ఆసక్తికరమైన టచ్ ఇవ్వాలనే ఆలోచనతో, ఒక భవనం మూడవ అంతస్తు నుంచి రక్షణ వలను తొలగించి కెమెరా ముందు నిల్చుందామని ప్రయత్నించాడు.కానీ, అదృష్టం బాగోలేక అతడు ప్రొటెక్టివ్ ఫెన్స్ పైనుంచి తూలిపడ్డాడు.

అంతే, చూస్తుండగానే అతను మూడు అంతస్తుల ఎత్తు నుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గానూ మారింది.

అందులో ఒక యువకుడు రీల్స్ వీడియో చేయడం చూడవచ్చు.చేస్తూ ఆ భవనం పైన ఉన్న ఒక మినప పట్టీ ( Minapa Patti )లాంటిది పైకి లేపాడు.

అయితే అది కొద్దిగా బరువు ఉండటంతో అతను దానిని సరిగా లేపే లోపే ముందుకు తూలిపడ్డాడు.క్షణాల్లోనే అతను అక్కడినుంచి కింద పడిపోవడం కనిపించింది.

ఈ రీల్స్ వీడియోను వారి ఫ్రెండ్స్ రికార్డ్ చేస్తున్నట్లుగా కూడా గమనించవచ్చు.

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తాపత్రయం ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన చూపిస్తోంది.ఈ యువకుడు తన ఫాలోవర్లను ఆకట్టుకోవడానికి ప్రాణాలను పణంగా పెట్టాడు.సోషల్ మీడియాలో వైరల్‌గా మారే వీడియో కోసం ప్రమాదకరమైన స్టంట్ చేయడం, అతని జీవితానికి ముగింపుకు కారణమైంది.

ఈ విషాద సంఘటన తర్వాత, పోలీసులు, స్థానిక అధికారులు సోషల్ మీడియా కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ఎంత ప్రమాదకరమని ప్రజలకు హెచ్చరిక చేశారు.వైరల్ కావాలనే తాపత్రయంలో తమ ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని ముఖ్యంగా యువ కంటెంట్ క్రియేటర్లను కోరారు.ఈ ప్రమాదంలో యువకుడు మరణించడంతో అతని కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube