స్విఫ్ట్ కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొంది.దీంతో కారులో ప్రయాణిస్తున్న కుటుంబం దుర్మరణం చెందారు.
కారు మొత్తం నుజ్జునుజ్జుగా అవడంతో కారులో ఒకరు తప్ప అందరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా, అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
వేగంగా వస్తున్న లారీ స్విఫ్ట్ కారును ఢీకొన్న ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే-7పై ఈ ప్రమాదం సంభవించింది.దొడ్డబైలగుర్కి గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి స్విఫ్ట్ కారులో ఓ కుటుంబం బెంగళూరు నుంచి తమ స్వస్థలం హైదరాబాద్ కు బయలుదేరుతుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొంది.
దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది.కారులో ప్రయాణిస్తున్న భార్య భర్తలు, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలై రక్తస్రావం ఏర్పడింది.కారులో ఉన్న జయశ్రీ (50), కుమారులు అక్షయ్ (28), హర్ష (24) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.దినేష్ (53)కు తీవ్ర గాయాలయ్యాయి.
దినేష్ బెంగళూరులోని జిగణిలో టైల్స్ షోరూం వ్యాపారాన్ని నిర్వహిస్తూ అక్కడే సెటిల్ అయ్యారు.స్వస్థలం హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కేసు విచారణలో ఉందని నిందితుడిని కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.