రెండు తెలుగు రాష్ట్రాల్లో తన స్టైల్, డ్యాన్స్, యాక్టింగ్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ కొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించారు.అల్లు అర్జున్ బాలనటుడిగా నటించడమే ఒక విశేషమైతే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడం మరో విశేషం.
ఇప్పటివరకు మనకు జూనియర్ ఎన్టీఆర్, తరుణ్, మహేష్ బాబు బాలనటులుగా కనిపించారనే తెలుసు.మహేష్ బాబు కృష్ణ నటించిన చాలా సినిమాల్లో బాలనటుడిగా నటించి మెప్పించారు.హీరో తరుణ్ దాదాపు 20 సినిమాల్లో బాలనటుడిగా నటించి ప్రశంసలు అందుకున్నారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాల్లో బాల నటుడిగా కనిపించి మెప్పించారు.
అల్లు అర్జున్ విషయానికి వస్తే ఈయన పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.రెండు సినిమాల్లో బాల నటుడిగా నటించిన అల్లు అర్జున్ తన నటనతో అభిమానులను మెప్పించారు.అల్లు అర్జున్ బాల నటుడిగా నటించిన సినిమాల్లో ఒకటి చిరంజీవి విజేత కాగా మరొకటి కమల్ హాసన్ స్వాతిముత్యం.ఈ సినిమాలో అల్లు అర్జున్ కమల్ హాసన్ మనవడిగా నటించారు.ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులను సొంతం చేసుకుంది.
అల్లు అర్జున్ సినిమాల్లోకి రాకముందు మెగాస్టార్ హీరోగా నటించిన డాడీ సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
సుకుమార్ సినిమా తరువాత అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నాడని తెలుస్తోంది.ఈ సంవత్సరం అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన రేంజ్ ను మరింత పెంచుకునే విధంగా సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు.