కాలం మారింది. దానితో పాటు మనుషుల అలవాట్లు, వేష ధారణ, జీవన శైలిలో కూడా కొత్త కొత్త మార్పులు వచ్చాయి.
ఒకప్పుడు ఆడవాళ్లు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడేవారు.అలగే అప్పట్లో ఆడవాళ్లు పెళ్ళికాకముందు లంగా ఓణీ వేసుకునేవారు.
పెళ్లి అయిన తర్వాత చీర మాత్రమే ధరించేవారు.కానీ ఇప్పుడు కాలంతో పాటు ఆడవాళ్ళలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి.
బయట ఉద్యోగాలు చేస్తున్నారు.తమకి నచ్చిన బట్టలు వేసుకుని నచ్చిన జీవితాన్ని గడుపుతున్నారు.
అయితే ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక కూడా తనకి నచ్చిన జీన్స్ ప్యాంటు వేసుకుని తనకి నచ్చిన లైఫ్ స్టైల్ గడిపేది కానీ ఇంట్లో వాళ్ళకి అది నచ్చక పాపం ఆ యువతిని కొట్టి మరి దారుణంగా చంపేశారు.
ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.17ఏళ్ల బాలికను కుటుంబసభ్యులే కొట్టి చంపేసి బ్రిడ్జి మీద పడేసారు.కానీ, ఆ బాలిక డ్రెస్ బ్రిడ్జిలో చిక్కుకోవడంతో ఆమె డెడ్ బాడీ కింద పడలేదు.
బ్రిడ్జికి వేలాడుతన్న మృతదేహాన్ని అటుగా వెళ్తున్న వ్యక్తి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.కస్యా-పట్నా హైవే పై ఉన్న పతన్ వా బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే మృతురాలి తండ్రి పంజాబ్ లుధియానాలో పని చేస్తున్నాడు.కుటుంబ సభ్యులతో కలిసి లుధియానాకు వెళ్లాక ఆ బాలిక లైఫ్ స్టైల్ మారిపోయింది.
మోడరన్ దుస్తులు ధరించడానికి అలవాటు పడిపోయింది.ఆ తర్వాత బాలిక,ఆమె తల్లి మాత్రమే తిరిగి డియోరియాలోని మహుదీహ్ ప్రాంతంలోని తమ స్వగ్రామానికి వచ్చేశారు.
అయితే గ్రామానికి వచ్చినా గాని ఆ బాలిక జీన్స్ ప్యాంట్లు వేసుకుంటూ ఎక్కువ సమయం ఇంటి బయటే గడిపేది.బాలిక ప్రవర్తన నచ్చని కుటుంబసభ్యులు జీన్స్ వేయడం మానేయాలని, ఎక్కువ సేపు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండమని చెప్పు అంటూ బాలిక తల్లికి బాలిక మామయ్యలు చెప్పారు.
కానీ తల్లి, మామయ్యలు మాట వినని బాలిక తన కుటుంబసభ్యులతో గొడవపడి, నేను నాకు నచ్చినట్లు ఇలాగే ఉంటాను అని తెగేసి చెప్పింది.ఈ గొడవలో బాలిక కోపంతో తన మామయ్య అర్వింద్ పై చేయి చేసుకోవడంతో అర్వింద్, అతడి భార్య, అర్వింద్ తమ్ముడు వ్యాస్ ముగ్గురూ కూడా కోపంతో రగిలిపోయి బాలికపై దాడి చేసి బాలికను బలంగా తోయడంతో బాలిక తల గోడను బలంగా తాకి రక్తం వచ్చింది.
వెంటనే బాలిక అక్కడిక్కడే చనిపోయింది.చనిపోయిన బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఆటోలో ఎక్కించుకుని బ్రిడ్జిపైకి తీసుకెళ్లి పైనుంచి పడేశారు.అయితే ఆమె డ్రెస్ బ్రిడ్జికి తగులుకోవడంతో మృతదేహం కిందకు పడకుండా వేలాడుతూ ఉండిపోయింది.ఆ బాలిక హత్య కేసులో నిందితులు అయిన తాత(పరమ్ హన్స్ పాస్వాన్)ను అరెస్ట్ చేశారు.
మామయ్యలు(వ్యాస్ పాస్వాన్, అర్వింద్ పాస్వాన్) పరారీలో ఉన్నారు.వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.