'మైనంపల్లి ' నిర్ణయం పై కాంగ్రెస్ లో టెన్షన్ !

మల్కాజ్ గిరి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mainampalli hanumanthrao ) వ్యవహారం ఆ పార్టీతో పాటు,  కాంగ్రెస్ లోనూ టెన్షన్ పుట్టిస్తుంది.ఇటీవల కెసిఆర్( Cm kcr ) ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు ఉంది.

 Tension In The Congress Over The Mayanampally Decision , Mainampalli Hanumanth-TeluguStop.com

అయితే తనతో పాటు,  తన కుమారుడు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాల్సిందేనని మైనంపల్లి పట్టుపడుతుండడమే అసలు సమస్య.అభ్యర్థుల పేర్ల ప్రకటనకు ముందు రోజే తెలంగాణ మంత్రి హరీష్ రావు( Harish Rao ) పై మైనంపల్లి హనుమంతరావు సంచలన విమర్శలు చేశారు.

ఇక ఆ తర్వాత నుంచి మైనంపల్లి వ్యవహారం బీ ఆర్ ఎస్ కు పెద్ద తలనొప్పి గానే మారింది.ఈ క్రమంలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి మరో అభ్యర్థిని బీఆర్ఎస్ వెతుకుతోంది.

ఇది ఇలా ఉంటే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఈ విధంగా బీఆర్ఎస్ పై విమర్శలు చేశారనే ప్రచారం జరిగింది.

Telugu Malkajgiri Mla, Medakasembly, Rohith, Telangana-Politics

కాంగ్రెస్ లో చేరితే తనతో పాటు , తన కుమారుడికి కూడా టికెట్ ఇస్తామని హామీ లభించడంతో,  ఆ పార్టీలో చేరబోతున్నారనే హడావుడి కొద్ది రోజులుగా నడుస్తోంది.అయితే మైనంపల్లి పార్టీ మార్పు విషయంపై నేరుగా స్పందించకపోవడంతో,  ఆయన నిర్ణయం పై కాంగ్రెస్ ( Congress )నేతల్లో టెన్షన్ కలిగిస్తోంది.ఇప్పటి వరకు  మెదక్ మల్కాజ్ గిరి టికెట్ తమదే అన్న ఆశాభావంతో ఉన్న నేతలంతా ఇప్పుడు మైనంపల్లి నిర్ణయం పై ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు.

ఒకవైపు బీఆర్ఎస్ కూడా మైనంపల్లి ని బుజ్జగించే ప్రయత్నం మొదలుపెట్టడం,  ఆయనతో చర్చలు జరుపుతూ ఉండడంతో, ఆ చర్చలు సఫలం కావాలని మైనంపల్లి బీఆర్ఎస్ లోనే ఉండాలని కాంగ్రెస్ కి చెందిన పలువురు నేతలు ఆకాంక్షిస్తున్నారు.కాంగ్రెస్ టికెట్ తనకే దక్కుతుందని ధీమాతో ఇప్పటివరకు విస్తృతంగా ప్రచారం చేసిన డిసిసి అధ్యక్షుడు కాంటారెడ్డి తిరుపతి ఒకసారిగా సైలెంట్ అయ్యారు.

Telugu Malkajgiri Mla, Medakasembly, Rohith, Telangana-Politics

మైనంపల్లి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న వార్తలు నేపథ్యంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమానికి కాంటారెడ్డి తిరుపతి బ్రేక్ వేశారు .తిరుపతిరెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి , సుప్రభాత్ రావు, మ్యాడమ్ బాలకృష్ణ తో పాటు అనేకమంది నాయకులు టికెట్ కోసం దరఖాస్తులు చేశారు.  అయితే మైనంపల్లి హనుమంతరావు నిర్ణయం ఏమిటి అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు.ఒకటి రెండు రోజుల తరువాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.బీఆర్ఎస్ లో మైనంపల్లికి టికెట్ దక్కినా,  ఆయన కుమారుడు రోహిత్ కు మెదక్ టికెట్ దక్కకపోవడమే ఆయన అసంతృప్తి కారణం. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి( MLA Padma Devender reddy )కి కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో,  ఆ సీటును తన కుమారుడికి ఇవ్వాలని మైనంపల్లి కోరుతున్నారు.

అయితే ఆ సీటు మార్చే అవకాశం కనిపించడం లేదు.దీంతో ఆయన కాంగ్రెస్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే మైనంపల్లిని పార్టీలోకి తీసుకోవద్దని టిక్కెట్ ఆశిస్తున్న నేతలు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వద్ద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట.ఇక మైనంపల్లి హనుమంతరావు ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన వెంటే ఉంటామని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు టెన్షన్ కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube