అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఛైర్మన్ హోదాలో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇవాళ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి అధికారులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.అయితే శాంతి భద్రతల దృష్ట్యా పింఛన్ పంపిణీకి రావొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు.
దీంతో పోలీసుల తీరుపై జేసీ తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు.కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా వెళ్లనివ్వకపోవడంపై మండిపడ్డారు.
ఈ క్రమంలో తాడిపత్రిలో ఉద్రిక్తత ఏర్పడింది.