అమరావతిలోని కృష్ణయ్యపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ సెంటు భూములను సిద్ధం చేస్తుంది.
ప్రభుత్వం అందిస్తున్న పేదలు అందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి భూములను సీఆర్డీఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఫెన్సింగ్ ను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో సీఆర్డీఏ అధికారుల జేసీబీలను రైతులు అడ్డుకున్నారు.అధికారులకు, రైతులకు మధ్య వివాదం చెలరేగింది.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.