జాలరికి చిక్కిన అరుదైన బ్లూ కలర్ ఎండ్రకాయ.. దీని ప్రత్యేకత ఏమిటంటే!

భూమిపైనే కాదు సముద్రంలో ఉండే కొన్ని జీవరాశులు కూడా అత్యంత అందంగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ అందరినీ కట్టిపడేస్తాయి.అయితే ఈ అందాన్ని వీక్షించడం నిత్యం సాధ్యం కాదు.

 Fisherman Caught Rare Blue Color Lobster Video Viral Details, Viral Latest, New-TeluguStop.com

ఎప్పుడో ఒకసారి ఈ బ్యూటిఫుల్ జీవులను చూసే భాగ్యం దొరుకుతుంది.తాజాగా ఆ అదృష్టం మరోసారి అందరికీ దక్కింది.వివరాల్లోకి వెళితే.20 లక్షలు లేదా 1 కోటి ఎండ్రకాయలు పడితే అందులో ఒకటి మాత్రమే బ్లూ కలర్ ఎండ్రకాయ ఉంటుంది.అది కూడా కచ్చితంగా చెప్పలేం.ఈ ఏడాది బ్లూ కలర్ ఎండ్రకాయ దొరికితే మళ్లీ 10-15 ఏళ్ల తర్వాత మాత్రమే దీన్ని చూసే అదృష్టం దక్కుతుంది.అంత అరుదైన పీతలు ఇవి!

అయితే తాజాగా ఒక జాలరికి ఈ అరుదైన బ్లూ కలర్ ఎండ్రకాయ దొరికింది.దానిని అతడు వీడియో తీశాడు.

అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వావ్, ఈ ఎండ్రకాయ చాలా అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.ఇది నీలం రంగులో మిరిమిట్లు గొలుపుతూ అత్యంత సుందరంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

సాధారణంగా ఎండ్రకాయలు నలుపు-గోధుమ రంగులో కనిపిస్తాయి.కానీ ఈ ఎండ్రకాయ కాటన్ క్యాండీ కలర్‌లో కనిపించి ముచ్చటగొలుపుతుంది.కాగా ఆ జాలరి ఈ అందమైన ఎండ్రకాయను మళ్లీ నీటిలోనే వదిలి పెట్టాడట.లాడ్ బైబిల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే రెండన్నర లక్షలకు పైగా లైక్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube