జాలరికి చిక్కిన అరుదైన బ్లూ కలర్ ఎండ్రకాయ.. దీని ప్రత్యేకత ఏమిటంటే!

భూమిపైనే కాదు సముద్రంలో ఉండే కొన్ని జీవరాశులు కూడా అత్యంత అందంగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ అందరినీ కట్టిపడేస్తాయి.

అయితే ఈ అందాన్ని వీక్షించడం నిత్యం సాధ్యం కాదు.ఎప్పుడో ఒకసారి ఈ బ్యూటిఫుల్ జీవులను చూసే భాగ్యం దొరుకుతుంది.

తాజాగా ఆ అదృష్టం మరోసారి అందరికీ దక్కింది.వివరాల్లోకి వెళితే.

20 లక్షలు లేదా 1 కోటి ఎండ్రకాయలు పడితే అందులో ఒకటి మాత్రమే బ్లూ కలర్ ఎండ్రకాయ ఉంటుంది.

అది కూడా కచ్చితంగా చెప్పలేం.ఈ ఏడాది బ్లూ కలర్ ఎండ్రకాయ దొరికితే మళ్లీ 10-15 ఏళ్ల తర్వాత మాత్రమే దీన్ని చూసే అదృష్టం దక్కుతుంది.

అంత అరుదైన పీతలు ఇవి! అయితే తాజాగా ఒక జాలరికి ఈ అరుదైన బ్లూ కలర్ ఎండ్రకాయ దొరికింది.

దానిని అతడు వీడియో తీశాడు.అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది.

దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.వావ్, ఈ ఎండ్రకాయ చాలా అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇది నీలం రంగులో మిరిమిట్లు గొలుపుతూ అత్యంత సుందరంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

సాధారణంగా ఎండ్రకాయలు నలుపు-గోధుమ రంగులో కనిపిస్తాయి.కానీ ఈ ఎండ్రకాయ కాటన్ క్యాండీ కలర్‌లో కనిపించి ముచ్చటగొలుపుతుంది.

కాగా ఆ జాలరి ఈ అందమైన ఎండ్రకాయను మళ్లీ నీటిలోనే వదిలి పెట్టాడట.

లాడ్ బైబిల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే రెండన్నర లక్షలకు పైగా లైక్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

అశ్విన్ CSKలోకి తిరిగి రావడంపై అసలు విషయం ఇదే!