1.భారత్ విమానాలపై కెనడా నిషేధం

భారత విమానాలపై ఉన్న నిషేధం కెనడా మరోసారి పొడిగించింది ఈ నెల 26 వరకు భారత్ నుంచి వచ్చే డైరెక్ట్ విమానాలపై నిషేధంకొనసాగుతుందని ప్రకటించింది.
2.కమర్షియల్ విజిట్ వీసాదారులకు కువైట్ శుభవార్త
వలసదారులు ఎవరైతే కమర్షియల్ విజిట్ వీసా కలిగి ఉన్నారో వారికి వర్క్ పర్మిట్ కు మార్చుకునే వెసులుబాటు ను కల్పించింది.
3.అమెరికా ప్రయాణంలో ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు బయలుదేరి వెళ్లారు.
4.భారత వాక్సినేషన్ సర్టిఫికేట్ కు యూకే అభ్యంతరం
కోవీ షీల్డ్ వాక్సిన్ వేసుకున్న వారిని యునైటెడ్ కింగ్డమ్ ( యూకే ) అంగీకరించలేదు.కరోనా వాక్సిన్ రెండు డోస్ లు తీసుకున్నప్పటికీ భారతీయులకు క్వారంటైన్ విధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
5.కరోనా తో మానసిక రుగ్మతలు
కరోనాతో అనేక మానసిక రుగ్మతలు వస్తున్నాయి అని అమెరికా లోని బీఎంజే ఓపెన్ జర్నల్ లో స్టడీ కి చెందిన నివేదికను పబ్లిష్ చేశారు.
6.ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ వ్యతిరేక ప్రదర్శనలు

ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి.వ్యాక్సిన్ తప్పనిసరి చేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది నిరసన తెలియజేస్తూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
7.యూఎన్ కు తాలిబన్ లేఖ

ప్రపంచ దేశాల్లో గుర్తింపు కోసం తాలిబన్ లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈనెల 21 నుంచి 27 వరకు జరిగే ఐక్యరాజ్యసమితి 76 వార్షిక సమావేశాలు ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని ఆఫ్ఘనిస్తాన్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యదర్శి ఆతోనియో గుటెరస్ కు లేఖ రాశారు.
8.ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల చదువు నిషేధం పై పాక్ ప్రధాని స్పందన
ఆఫ్ఘనిస్తాన్ లో బాలికలు చదువుకోకుండా అడ్డుకోవడం అనేది ఇస్లామిక్ వ్యవస్థకు వ్యతిరేకమని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
9.ఆస్ట్రేలియా లో భూకంపం

ఆస్ట్రేలియా లో భారీ భూకంపం సంభవించింది.రెండో అతిపెద్ద నగరం మెల్ బోర్న్ సమీపంలో సంభవించిన భూప్రకంపనలు తీవ్రతకు అనేక భవనాలు కంపించాయి. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.8 గా నమోదైంది.
10. ఫ్రాన్స్ భారత్ కీలక నిర్ణయం
జలాంతర్గాములు కొనుగోలు వివాదం అంశంలో అమెరికా ఆస్ట్రేలియా పై గుర్రుగా ఉన్న ఫ్రాన్స్ ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ తో కలిసి పని చేయాలని నిర్ణయించుకుంది.