1.‘ నాదం ‘ పేరుతో ‘ ఆటా’ పాటల పోటీ
అమెరికా తెలుగు సంఘం ( ఆటా ) ‘ నాదం’ పేరిట ఆన్లైన్ వేదికగా పాటల పోటీలు నిర్వహిస్తోంది.ఏపీ తెలంగాణ వచ్చిన 14 నుంచి 26 ఏళ్ల వయసు గల వారు ఈ పోటీలో పాల్గొనవచ్చు.ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 30 లోపు www.tinyuri.com/ atanandam 2021 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని నిర్వాహకులు తెలిపారు.
2.కెనడాలో భారతీయుడి హత్య

ఉపాధి కోసం కెనడా వెళ్ళిన భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.పంజాబ్ రాష్ట్రం మొగాకు చెందిన 23 ఏళ్ల ప్రభజోత్ సింగ్ కత్రి ని ఆయన నివాసం ఉండే నోవా స్కాటియలోని ట్రూరో నగరం లోని అపార్ట్మెంట్ లో కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా కొట్టడంతో ఆసుపత్రి లో చికిత్చ పొందుతూ మృతి చెందాడు.
3.కువైట్ లో ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు
ఎప్పుడూ లేని విధంగా నీట్ పరీక్ష కోసం భారత ప్రభుత్వం కువైట్ లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే.దీనికోసం అనేక మార్గదర్శకాలను విద్యార్థుల కోసం విడుదల చేసింది.ఈ నెల 12 న ఎంబసీ ప్రాంగణంలోనే ఈ పరీక్ష ను నిర్వహించనున్నారు.
4.గ్యాస్ మాస్క్ లతో సైనిక పరైడ్
EPA 73 వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తర కొరియా మిలటరీ పరైడ్ నిర్వహించింది.గ్యాస్ మాస్కులు ధరించి వారితో కవాతు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హాజరయ్యారు.
5.అధికారులకు ఆఫ్గాన్ ప్రధాని విజ్ఞప్తి

ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అయితే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు విధులకు హాజరు కాకపోవడం చాలా మంది దేశం విడిచి వెళ్లి పోవడంతో ఆఫ్ఘన్ ప్రధాని ముల్లా మొహమ్మద్ హాసన్ ప్రభుత్వ అధికారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని ,తిరిగి దేశానికి రావలసిందిగా కోరారు.
6.ఆఫ్ఘనిస్తాన్ కు చైనా అత్యవసర సాయం
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తాలిబన్ ప్రభుత్వం తో సంబంధాలు కొనసాగిస్తామని చెప్పడమేకాదు ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ సాయం ప్రకటించారు.ఆఫ్ఘనిస్తాన్‌కు 31 మిలియన్ డాలర్ల విలువైన అత్యవసర సాయం అందించబోతున్నట్లు ప్రకటించారు.
7.ఉపాధ్యాయులకు షరతులు విధించిన పాకిస్తాన్

ఫెడరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద స్కూలు కాలేజీ లో యూనివర్సిటీ లలో ఉపాధ్యాయులు జీన్స్ టీ షర్ట్ లు లేదా టైట్స్ ధరించకూడదు అని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
8.నార్వే రాయబార కార్యాలయం లో విధ్వంసం
ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ప్రకటించిన తాలిబన్లు తాజాగా కాబూల్ లోని నార్వే రాయబార కార్యాలయం ను ఆక్రమించి ధ్వంసం చేశారు.
9.బాలీవుడ్ నటి కి పాకిస్థాన్ కోర్టు అరెస్ట్ వారెంట్

బాలీవుడ్ నటి సబా ఖమర్ కు కొత్త చిక్కులు వచ్చాయి.పాకిస్థాన్ కు చెందిన కోర్టు ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
10.అయిన్ దుబాయ్ సందర్శనకు ఆహ్వానం
అయిన్ దుబాయ్, ప్రపంచంలోనే అతి పెద్దదైన అబ్జర్వేషన్ వీల్ అక్టోబర్ 21 న ప్రారంభం కానుంది.ఈ మేరకు టికెట్ కౌంటర్ ను ఓపెన్ చేసింది.