1.హైదరాబాదులో ఆస్ట్రేలియా కాన్సులేట్ : కేటీఆర్ వినతి

హైదరాబాదులో ఆస్ట్రేలియా కౌన్సిల్ లేట్ ఏర్పాటు చేయాలి అని చెన్నై లోని ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ సారా కిర్లె ను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు.
2.లండన్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
నందమూరి తారక రమారావు శతజయంతి ఉత్సవాలను లండన్ లోని తెలుగు ఎన్నారైలు వైభవంగా నిర్వహించారు.
3.నాట్స్ నూతన అధ్యక్షుడిగా బాపయ్య చౌదరి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ 2022 24 కాలానికి నూతన వర్గాన్ని ప్రకటించింది.నాట్స్ నూతన అధ్యక్షుడిగా బాపయ్య చౌదరిని ఎన్నుకొన్నారు.
4.ప్రవాసులకు ముఖ్య గమనిక

కువైట్ లోని భారత ఎంబసీ బుధవారం ఓపెన్ హౌస్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.భారత రాయబారి సి బి జార్జ్ ఈ కార్యక్రమం ద్వారా కువైట్ లోని భారత ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తారు.
5.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు తోపాటు మహానాడు సంబరాలు అమెరికాలోని కాన్సాస్ నగరం లో ఎన్.ఆర్.ఐ టిడిపి కాన్సాస్ సిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
6.శ్రీలంకకు భారత్ డిజిటల్ సాయం
ఆర్థిక కష్టాలు తో సతమతమౌతున్న శ్రీలంకకు భారత్ కొనసాగిస్తూనే ఉంది .తాజాగా 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ ను ఆ దేశానికి భారత్ పంపించింది.
7.తైవాన్ గగనతలం కి 30 యుద్ద విమానాలు పంపించిన చైనా

తైవాన్ తమ భూభాగం అని వాదిస్తున్న చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది.తైవాన్ గగనతల రక్షణ వ్యవస్థలోకి 30 విమానాలను పంపించింది.
8.అమెరికాలో ప్రమాదం ప్రకాశం జిల్లా వాసి మృతి
అమెరికాలో విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది.ఫ్లోరిడాలో ప్యారాచూట్ ఫ్లయింగ్ చేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలడంతో బాపట్ల జిల్లా సంత మాగనూరు మండలం మక్కేనవారిపాలెం గ్రామానికి చెందిన సుప్రజ అక్కడికక్కడే మృతి చెందారు.
9.రష్యా చమురు దిగుమతి పై బ్యాన్ విధించిన ఈయూ

ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగిస్తూనే ఉంది.ఈ నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతి చేసే అంశం లో ఈయూ దేశాలు కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాయి.రష్యా నుంచి దిగుమతి అవుతున్న ఇంధనం లో రెండింట మూడవ వంతుని ఆపేయాలని ఆ దేశాలు భావిస్తున్నాయి.