1.ఫ్లోరిడా లో ఉంటున్న భారతీయులకు శుభవార్త
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కొత్త చట్టాన్ని తీసుకు రాబోతోంది.
ఈ కొత్త చట్టం ద్వారా ట్యాక్స్ హాలిడే ను ప్రకటించనుంది.ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే సాంసంగ్ ఉన్న భారతీయులకు పెద్ద ఉపశమనం కలిగినట్టే.
2.దుబాయ్ లో లాటరీ గెలుచుకున్న భారతీయులు
దుబాయ్ లో నిర్వహించిన మహా జుజ్ లక్కీ వీక్లీ డ్రా లో ముగ్గురు భారతీయులు ఖరీదైన బహుమతులు గెలుచుకున్నారు.ఒకరు ఖరీదైన ఎస్ యూ వీ వాహనం గెలుచుకోగా మరో ఇద్దరు చెరో ధిర్హంస్ గెలుచుకున్నారు.
3.రస్ అల్ ఖైమా లో భారతీయ నర్సు మృతి

కేరళ రాష్ట్రం కొచ్చికి చెందిన తింటూ పాల్ (36) అనే మహిళ దుబాయ్ లోని రస్ అల్ ఖైమా లో నర్సు గా విధులు నిర్వహిస్తున్నారు.ఈమె కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లిన సమయంలో కారు అతి వేగం కారణంగా అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో అంత తీవ్రంగా గాయపడగా, తింటూ పాల్ చికిత్స పొందుతూ మరణించారు.
4.పౌరసత్వం వదులుకున్న 7.5 లక్షల మంది భారతీయులు
గత 6 ఏళ్లలో సుమారు 7.5 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వడులుకున్నట్టు , ఆరువేల మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.
5.భారతీయుల అక్రమ రవాణాను అడ్డుకున్న యూఎస్ అధికారులు
అమెరికా లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆరుగురు భారతీయులతో సహా ఏడుగురిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
6.ఆఫ్ఘన్ మహిళ లకు మరో కొత్త రూల్

ఆఫ్గన్లో మహిళలు బయటకు రావాలంటే తప్పనిసరిగా బురకా ధరించాల్సిందే అని ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
7.తనను తాను గాడిద తో పోల్చుకున్న మాజీ ప్రధాని
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనను తాను గాడిదతో పోల్చుకున్నారు.దీనిపై ఆయన నెటిజన్స్ నుంచి ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు.
8.ఇండియాలో యాపిల్ పేమెంట్ లకు బ్రేక్

ఇండియాలో ఆర్బిఐ పేమెంట్లు విషయంలో కొత్త రూల్ ప్రకటించడంతో యాపిల్ సంస్థ తమ యాప్ ల పై పెమెంట్లను నిలిపివేసింది.
9.కోర్టుకెక్కిన ట్విట్టర్ వాటాదారుల
ఎలన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. ఎలెన్ మాస్క్ డీల్ కు నిరసనగా ట్విట్టర్ వాటాదారులు కోర్టుకెక్కారు.
10.బొమ్మ తుపాకులపై పాక్ లో అలజడి

పాకిస్థాన్ లో పిల్లలు బొమ్మ తుపాకులతో ఆడుకోవడం ఫ్యాషన్ గా మారింది.వీటిని వెంటనే నిషేదించాలని పాకిస్తాన్ ప్రవేట్ స్కూల్ డిమాండ్ చేస్తోంది.