1.పాకిస్తాన్ లో జిన్నా విగ్రహం పేల్చివేత

పాకిస్తాన్ లో బాంబులతో మహమ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని బాంబులు పేల్చి వేశారు.ఈ ఘటన బలూచిస్తాన్ తీరప్రాంత నగరం గ్వాధర్ లో జరిగింది.ఈ ఘటనకు పాల్పడింది తామేనని తీవ్రవాద సంస్థ బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ ప్రకటించింది.
2.స్వలింగ సంపర్కం కే వారి ఓటు
స్విజర్లండ్ లో ఇకపై స్వలింగ వివాహాలు, పౌర వివాహాలు చట్టబద్దం కానున్నాయి.ఈ మేరకు ప్రభుత్వం ప్రజా ఓటింగ్ కు వెళ్లగా స్వలింగ సంపర్కం కే మెజార్టీ ప్రజలు ఓటు వేశారు.
3.కరోనా మూలలపై డబ్ల్యూహెచ్వో దర్యాప్తు

Covid 19 ఆనవాళ్లను గుర్తించేందుకు మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టే అవకాశాలు ఉన్నాయని యుఎస్ మీడియా రిపోర్ట్ చెబుతోంది.
4.గూగుల్ సంచలన నిర్ణయం
గూగుల్ క్లౌడ్ మార్కెట్ ప్లేస్ నుంచి స్మార్ట్ వేర్ ను ఇతరుల నుంచి కొన్నప్పుడు గూగుల్ కొంత శాతం డబ్బు తీసుకుంటుంది.దీనిపై విమర్శలు రావడంతో గూగుల్ క్లౌడ్ ఫ్లాట్ఫామ్ పర్సంటేజ్ ను ఇరవై నుంచి మూడు శాతానికి తగ్గించింది.
5.చైనా ఫోన్లు విసిరికొట్టాలి అంటూ రక్షణ శాఖ పిలుపు

లితువేనియా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.చైనా ఫోన్లు కనిపిస్తే చాలు విసిరి కొట్టండి అవి మన దేశ రక్షణకు కీడు చేస్తాయి అంటూ ప్రకటన చేసింది.
6.హెయిర్ కటింగ్ .క్లీన్ షేవ్ పై ఆఫ్ఘన్ లో నిషేధం
ఆఫ్ఘనిస్తాన్ లో రోజుకో కొత్త రూల్ అమల్లోకి తీసుకువస్తున్నారు.తాజాగా హెయిర్ కటింగ్ ,క్లీన్ షేవ్ ను కూడా నిషేధించారు.
7.ఇజ్రాయిల్ లో కాల్పులు .ఐదుగురు పాలస్తీనియన్ లు మృతి

ఇజ్రాయిల్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఐదుగురు పాలస్తీనియన్ మిలిటెంట్ లు మృతి చెందారు.
8.చైనా కు చెక్ పెట్టేలా భారత్ ప్లాన్
ఇండియా లో ఉపయోగిస్తున్న చిప్ సెట్ లలో ఎక్కువ భాగం చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి.కానీ సంక్షోభ సమయంలో చిప్ సెట్ల సరఫరా విషయంలో భారత్ కి స్పష్టమైన హామీ ఏదీ రాకపోవడం తో సొంతంగానే చిప్ సెట్ల తయారీ ప్రారంభించాలని భారత్ నిర్ణయం తీసుకుంది.
9.ఫ్రాన్స్ అధ్యక్షుడి పై కోడిగుడ్డు దాడి

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మన్యియెల్ మాక్రాన్ పై ఓ వ్యక్తి కోడి గుడ్డు విసిరాడు.సోమవారం లియాన్ సిటీ లో అంతర్జాతీయ క్యాటరింగ్ , హోటల్ ఫుడ్ ట్రేడ్ ఫెయిర్ ను మక్రాన్ సందర్శిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.