1.ప్రయాణ ఆంక్షలను సడలించిన అమెరికా

ప్రపంచంలోని 33 దేశాలపై 18 నెలలు విధించిన కఠిన ప్రయాణ ఆంక్షలను తొలగించేందుకు అమెరికా సిద్ధమైంది.రెండు డోసులు టీకా, జాన్సన్ అండ్ జాన్సన్ అయితే ఒక డోసు వేయించుకున్న వారు నవంబర్ నుంచి అమెరికా కు వెళ్ళ వచ్చు.
2.ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ అమెరికన్స్
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఆపరేషన్ అమెరికన్స్ కు సంబందించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.ఈ స్కాం లో అమెరికన్ లు 300 కోట్లు మోసపోయిన ట్లు పోలీసులు తెలిపారు.
3.కెనడా ఎన్నికలు 17 మంది భారత సంతతి ఎంపీ ల విజయం

కెనడా ప్రధానిగా మూడోసారి జస్టిన్ ట్రూడో ఎన్నికయ్యారు.లిబరల్ పార్టీ మెజారిటీ సాధించకుండా ఆ పార్టీ అధికారాన్ని చేపట్టబోతోంది.ఈ సారి కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఎంపీ లుగా ఎన్నికయ్యారు.
4.పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో తొలి హిందూ మహిళ
పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో తొలి హిందూ మహిళగా సనా రామ్ చంద్ గుల్వానీ ఎంపికయ్యారు.పాకిస్తాన్ దేశ అత్యున్నత పబ్లిక్ సర్వీస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిన తొలి హిందూ మహిళ గా సనా రామ్ చంద్ గుల్వానీ చరిత్ర సృష్టించారు.
5.మోదీ బైడన్ భేటీపై వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు మధ్య ఈనెల 24న జరిగే వేటితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతమవుతుందని వైట్ హౌస్ అధికారులు పేర్కొన్నారు.
6.అమ్మకానికి రవీంద్రనాథ్ ఠాగూర్ నివాసగృహం
నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ లండన్ల కొంతకాలం పాటు నివసించిన గృహం తాజాగా అమ్మకానికి వచ్చింది.
7.భారత్ లో అడవుల పెంపకం .అమెరికా సాయం

భారత్ లో అనేక రాష్ట్రాల్లో అడవుల పెంపకానికి యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సాయం అందించనుంది.ఇప్పటివరకు బీహార్ కేరళకు మాత్రమే పరిమితమైన ఈ కార్యక్రమం ఏపీ , తెలంగాణ కు విస్తరించనుంది.ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి వీణా రెడ్డి ప్రకటించారు.
8.చైనాలో ‘ ఎవర్ గ్రాండ్ ‘ సంక్షోభం
చైనాలోని స్థిరాస్తి కంపెనీ ఎవర్ గ్రాండ్ సంక్షోభంలో పడింది చైనాతో పాటు ప్రపంచ మార్కెట్లకు ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది.భారత స్టాక్ మార్కెట్ లోని లోహ కంపెనీల షేర్ లు భారీగా పతనం అవుతున్నాయి.సంక్షోభం మరింత ముదిరితే భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది.
9.అమెరికాలో కరోనా విజృంభణ

అమెరికాలోమళ్లీ కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది.ఈ వైరస్ ప్రభావంతో రోజుకు లక్షలు కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు 2 వేల మందికి పైగా మృతి చెందుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
10. పిల్లలకు కరోనా ముప్పు తక్కువే : డబ్ల్యూహెచ్వో

కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లల్లో తక్కువగానే ఉంటుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.